ETV Bharat / sports

నా కల నెరవేరిందోచ్​.. ఫుల్​ ఖుషీలో దినేశ్​కార్తీక్​

author img

By

Published : Sep 13, 2022, 10:13 AM IST

dinesh karthik t20 world cup
దినేశ్ కార్తిక్​ టీ20 ప్రపంచకప్​

టీమ్​ఇండియా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం వల్ల దినేశ్​కార్తీక్​ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. తెగ సంబరపడిపోతున్నాడు. సోషల్​మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

టీమ్​ఇండియా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడంపై సీనియర్​ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ హర్షం వ్యక్తం చేశాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించిన అనంతరం దినేశ్.. తన కల నెరవేరిందంటూ సోషల్​మీడియాలో ట్వీట్ చేశాడు.

కాగా, సోమవారం సాయంత్రం చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై జట్టు వివరాలను వెల్లడించింది. అంతా ఊహించనట్లుగానే గాయాలతో జట్టుకు దూరమైన బుమ్రా, హర్షల్ పటేల్ పునరాగమనం చేయగా.. ఆసియాకప్ 2022లో విఫలమైన ఆవేశ్ ఖాన్‌పై వేటు పడింది. టీమ్​ఇండియా కాంబినేషన్​లో భాగంగా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను కూడా టీమ్‌మేనేజ్‌మెంట్ పక్కనపెట్టి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేసింది. మహ్మద్​ షమీ జట్టులోకి వస్తాడని ప్రచారం జరిగినా అతడిని బుమ్రా బ్యాకప్‌గా మాత్రమే సెలెక్టర్లు తీసుకున్నారు. అతడితో పాటు దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్‌లను స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేసింది.

కాగా, 2006లో సౌతాఫ్రికాతో భారత జట్టు ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగిన దినేశ్ కార్తీక్ ఇప్పటి వరకు కొనసాగడం విశేషం. 2019వన్డే ప్రపంచకప్ అనంతరం పూర్తిగా జట్టుకు దూరమైన దినేశ్ కార్తీక్.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడాడు. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్సీబీ తరఫున బరిలోకి దిగి బాగా ఆడటం అతడికి కలిసొచ్చింది. ఫినిషర్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చిన డీకే.. చాలా రోజుల తర్వాత భారత జట్టులోకి వచ్చి దుమ్మురేపాడు. దాంతో ఆసియా కప్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ 2022 ఆడాలనే తన లక్ష్యం నెరవేరడంతో కార్తీక్ ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. కలనేరవేరిందంటూ పేర్కొన్నాడు. ఇక అభిమానులు కూడా అతడికి విషెస్ తెలియజేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇదీ చూడండి: వారిని దూరం పెట్టి.. వీరికి పట్టం కట్టి.. టీమ్ ఇండియా ఎంపికలో ఇదేం వ్యూహం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.