ETV Bharat / sports

టీమ్​ఇండియాలో చోటు కోల్పోవడంపై స్పందించిన గబ్బర్​.. ఏమన్నాడంటే?

author img

By

Published : Feb 15, 2023, 8:49 PM IST

వన్డే జట్టులో చోటు కోల్పోవడంపై సీనియర్​ ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడాడు. ఏమన్నాడంటే?

Dhawan
టీమ్​ఇండియాలో చోటు కోల్పోవడంపై స్పందించిన గబ్బర్​.. ఏమన్నాడంటే?

టీమ్​ఇండియా వన్డే జట్టులో చోటు కోల్పోవడంపై సీనియర్​ ఓపెనర్ శిఖర్ ధావన్ స్పందించాడు. జీవితంలో ఇలాంటి ఎత్తు పల్లాలు సహజమని చెప్పాడు. తనకంటే మెరుగైన ఆటగాడు రావడంతో జట్టులో చోటు కోల్పోయానని తెలిపాడు. మళ్లీ జట్టులోకి వస్తాననే నమ్మకం తనకు ఉందని, దాని కోసం కష్టపడుతున్నట్లు పేర్కొన్నాడు.

"జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. సమయం, అనుభవం చాలా విషయాల్ని మనం ఎలా బ్యాలెన్స్​ చేయాలో నేర్పుతుంది. నేను అత్యుత్తమంగా ఆడాను. కానీ.. వేరొకరు నా కంటే మెరుగ్గా ఆడారు. అందుకే నాకు జట్టులో చోటు దక్కలేదు. అయితే.. ఎప్పటికైనా మళ్లీ జట్టులో చోటు దక్కించుకుంటాను" అని ధావన్ ధీమా వ్యక్తం చేశాడు.

కాగా, శిఖర్ ధావన్ గత రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అతడు స్థానంలో యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ వరుస అవకాశాలిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారత్ వేదిక జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కి అతడు ఆడటం అనుమానంగా మారింది. కాగా, మార్చిలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్‌కి కూడా గిల్ ఓపెనర్‌గా ఎంపికవడం కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గిల్ చివరి ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 4 సెంచరీలు బాదాలు. అందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇకపోతే గతేడాది నవంబర్‌లో.. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించిన శిఖర్ ధావన్.. ఆ తర్వాత డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆడాడు. కానీ.. ఆ తర్వాత మళ్లీ సెలెక్టర్లు గబ్బర్‌ను దూరం పెట్టారు.

ఇదీ చూడండి: కోహ్లీ లాంగ్ డ్రైవ్​.. ఆ ఒక్క ఫొటోతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.