ETV Bharat / sports

ఒకే రోజు బర్త్​డే సెలబ్రేషన్​ - వీరిలో ఉన్న కామన్​ పాయింట్​ ఏంటంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 9:51 AM IST

Updated : Dec 6, 2023, 12:02 PM IST

Cricketers Birthday On 6 December
Cricketers Birthday On 6 December

Cricketers Birthday On 6 December : సాధారణంగా ఎవరైనా ఫుడ్​ షేర్​ చేసుకంటారు, అవార్డులు షేర్​ చేసుంటారు. కానీ మన టీమ్​ఇండియాకు చెందిన ఐదుగురు క్రికెటర్లు ఒకే రోజున బర్త్​డే సెలబ్రేట్ చేసుకుని రికార్డు సృష్టిస్తున్నారు.

Cricketers Birthday On 6 December : సాధారణంగా క్రికెటర్లు ఒకే రికార్డులను షేర్​ చేసుకోవడం లేకుంటే ఒకే అవార్డులును షేర్ చేసుకున్న సందర్భాలు చూసుంటాం కానీ బర్త్​డేలు షేర్​ చేసుకోవడం గురించి ఎక్కడైనా విన్నామా. ఒకవేళ అలా ఉంటే కూడా ఇద్దరు లేక ముగ్గురు షేర్​ చేసుకున్న సందర్భాలున్నాయి. కానీ మన టీమ్ఇండియాకు చెందిన రవీంద్ర జడేజా, జస్ప్రీత్​ బుమ్రా, కరుణ్​ నాయర్​, శ్రేయర్​ అయ్యర్​ ఇలా ఐదుగురు క్రికెటర్లు ఒకే రోజున బర్త్​డే సెలబ్రేట్ చేసుకుని రికార్డు సృష్టిస్తున్నారు. అందులో ముగ్గురు ప్రస్తుత భారత జట్టులో ఉన్న ప్లేయర్లు కాగా, మిగతా ఇద్దరూ మాజీలు. ఇక ఫ్యాన్స్​ కూడా తమ అభిమాన తారలకు నెట్టింట బర్త్​డే విషెస్ తెలుపుతూ సందడి చేస్తున్నారు. విన్నూత్నమైన పోస్టర్లతో విషెస్ తెలుపుతూ ట్రెండ్​ అవుతున్నారు.

  • Birthday Checklist 📝
    1. World Cup Winner 🏆
    2. All-Round Rockstar 👨‍🎤
    3. Elite Pace Bowler 💣
    4. Next-gen Talent ⏭️
    5. F-Iyer Batter 📛
    6. Test Triple Centurion 🏔️

    Wishing all these fabulous Indian cricketers a very happy birthday! 🥳#PlayBold #HappyBirthday @imjadejapic.twitter.com/C8knQIuCKr

    — Royal Challengers Bangalore (@RCBTweets) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Ravindra Jadeja Paris Tour : ఇక జ‌డేజా ప్ర‌స్తుతం పారిస్ టూర్​లో ఉన్నాడు. త‌న‌కు ఫ్రీ టైమ్​ను ఎంజాయ్​ చేస్తున్న ఈ స్టార్ ప్లేయర్​ ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో అభిమానుల కోసం పోస్ట్ చేశాడు. పారిస్ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని ఆ తర్వాత ద‌క్షిణాఫ్రికాకు వెళ్లే భారత జ‌ట్టుతో జ‌డేజా క‌ల‌వ‌నున్నాడు. అయితే సౌతాఫ్రికా టూర్​లో భాగంగా జరగనున్న వ‌న్డేల‌కు జడ్డూ ఎంపిక కాలేదు. కానీ టీ20, టెస్టుల‌కు ప్ర‌క‌టించిన జ‌ట్ల‌లో స్థానం ద‌క్కించుకున్నాడు. అంతేకాకుండా టీ20ల్లో అత‌డికి వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను మేనేజ్​మెంట్​ అప్పగించింది. అలా దాదాపు 15 నెల‌ల త‌రువాత జడేజా టీ20 మ్యాచులు ఆడ‌నున్నాడు. 2022లో జ‌రిగిన ఆసియా క‌ప్​ టోర్నీ త‌ర్వాత గాయ‌ం కారణంగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు జడేజా దూరమయ్యాడు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఈ టోర్నీ వల్ల టీ20 మ్యాచులు ఆడనున్నాడు.

ఇక శ్రేయస్​ ఇటీవలే సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​లో రెచ్చిపోయాడు. స్కోర్​ బోర్డును పరుగులు పెట్టిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషంచాడు. అంతే కాకండా ప్రపంచకప్​లోనూ మంచి ఫామ్​ను కనబరిచాడు. మరోవైపు జస్ప్రీత్​ బుమ్రా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇటీవలే తనకు ఓ కుమారుడు జన్మించగా.. ఆ చిన్నారితో తన టైమ్​ స్పండ్​ చేస్తున్నాడు.

టీమ్ఇండియా 4 హండ్రెడ్ వాలా - సెంచరీలతో రెచ్చిపోయిన అయ్యర్, రాహుల్

'కొన్నిసార్లు నిశ్శ‌బ్ద‌మే ఉత్త‌మ స‌మాధానం'- బుమ్రా ఇన్​స్టా స్టోరీకి అర్థం అదేనా!

Last Updated :Dec 6, 2023, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.