ETV Bharat / sports

'ప్రపంచకప్​లో భారత్​పై గెలిచి బాకీ తీర్చుకుంటాం '

author img

By

Published : May 19, 2019, 7:59 PM IST

Updated : May 19, 2019, 11:38 PM IST

ఎంగిడి

వచ్చే ప్రపంచకప్​లో భారత్​పై గెలిచి సత్తా చాటుతామని దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి అన్నాడు. టీమిండియాపై ఓ సిరీస్​ గెలుపు బాకీ పడి ఉన్నామని చెప్పాడీ 23 ఏళ్ల ఫాస్ట్​ బౌలర్.

భారత్​పై సిరీస్ గెలుపు​ బాకీ పడి ఉన్నామని, ప్రపంచకప్​లో గెలిచి సమం చేస్తామని దక్షిణాఫ్రికా ఫాస్ట్​బౌలర్ లుంగి ఎంగిడి అన్నాడు. గతేడాది వన్డే సిరీస్​ను 5-1 తేడాతో భారత్ కైవసం చేసుకుందని చెప్పాడీ 23 ఏళ్ల పేసర్.

"గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ వచ్చినపుడు మా జట్టులో కొంతమంది కీలక ఆటగాళ్లు లేరు. వారితో ఓ సిరీస్​ గెలుపు బాకీ పడి ఉన్నాం. వచ్చే ప్రపంచకప్​లో పూర్తి జట్టుతో భారత్​పై సత్తా చాటుతాం. ప్రస్తుతం టీమిండియా బలంగా ఉంది. జూన్​ 5న భారత్​తో మ్యాచ్​ ఆసక్తికరంగా జరుగనుంది". -లుంగి ఎంగిడి, దక్షిణాఫ్రికా పేసర్

సౌతాఫ్రికా ఒక్కసారి కూడా ప్రపంచకప్​ గెలవలేకపోయిందని, ఈ సారి మా కల నెరవేరబోతోందని జోస్యం చెప్పాడు ఎంగిడి. 21.64 సగటుతో 34 వన్డే వికెట్లు తీసిన ఈ పేసర్ వరల్డ్​కప్​ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. మే 30 నుంచి ఇంగ్లండ్​ వేదికగా ప్రపంచకప్​ జరుగనుంది.

AP Video Delivery Log - 1300 GMT News
Sunday, 19 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1147: Indonesia France Jets AP Clients Only 4211587
French fighter juets make emergency landing in Aceh
AP-APTN-1129: Italy Poland Anniversary AP Clients Only 4211586
Italian, Polish leaders mark Montecassino battle
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated :May 19, 2019, 11:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.