ETV Bharat / sports

ధోనీ.. మీరు ఎప్పటికీ నా కెప్టెనే: కోహ్లీ

author img

By

Published : Aug 16, 2020, 7:07 PM IST

ధోనీ రిటైర్మెంట్​పై మరోసారి స్పందించాడు టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. ధోనీ ఎప్పటీకీ తన కెప్టెన్​గా ఉంటాడంటూ మాట్లాడిన వీడియోను సోషల్​మీడియాలో షేర్​ చేసింది బీసీసీఐ.

You will always be my captain: Kohli to Dhoni one more time
'ధోనీ.. నువ్వు ఎప్పటికీ నా కెప్టెన్​గానే ఉంటావు'

మహేంద్ర సింగ్​ ధోనీ రిటైర్మెంట్​పై మరోసారి స్పందించాడు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. 'మీరు ఎప్పటికీ నా కెప్టెనే' అంటూ ఓ వీడియోలో వెల్లడించాడు. ధోనీ నుంచి తనకు లభించిన స్నేహానికి, నమ్మకానికి మాజీ కెప్టెన్​కు కృతజ్ఞతలు తెలియజేశాడు. క్రికెట్​కు ధోనీ వీడ్కోలుపై విరాట్​ కోహ్లీ మాట్లాడుతున్న ఓ వీడియోను సోషల్​మీడియాలో పంచుకుంది భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ).

"జీవితంలోని కొన్ని సందర్భాల్లో మాటలు రాని క్షణాలు ఉంటాయి. వాటిలో ఇదొక్కటని నేను అనుకుంటా. ధోనీ గురించి చెప్పాలంటే బస్సులోని చివరి సీట్​లో కూర్చునే వ్యక్తి. మేమిద్దరం స్నేహంతో పాటు మంచి అవగాహనను పంచుకున్నాం. ఎందుకంటే మేము ఒకే లక్ష్యాల కోసం పనిచేశాం. అదే జట్టు విజయానికి కారణమైంది. మీతో(ధోనీ) కలిసి ఆడటం చాలా ఆనందంగా ఉంది. మీరు నాపై నమ్మకాన్ని చూపించారు. దీనికి మీకెంతగానో కృతజ్ఞతతో ఉంటా. గతంలో చెప్పిందే ఇప్పుడు చెబుతున్నా. మీరు(ధోనీ) ఎప్పుడూ నా కెప్టెన్​గానే ఉంటారు."

- విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్​స్టాగ్రామ్​ వేదికగా శనివారం ప్రకటించాడు. దీనిపై పలువురు ప్రముఖులతో సహా క్రికెట్​ అభిమానులు నిర్ఘాంతపోయారు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి జరగనున్న ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో చెన్నై సూపర్​కింగ్స్​కు ప్రాతినిధ్యం వహించనున్నాడు ధోనీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.