ETV Bharat / sports

'ధోనీ రిటైర్మెంట్​కు సమయం ఆసన్నమైంది'

author img

By

Published : Sep 20, 2019, 10:06 AM IST

Updated : Oct 1, 2019, 7:26 AM IST

ధోనీ రిటైర్మెంట్​పై వస్తోన్న వార్తలపై స్పందించాడు మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్. ఎవరూ వెళ్లిపోమనక ముందే వీడ్కోలు పలికితే బాగుంటుందని సలహా ఇచ్చాడు.

సునీల్

ప్రపంచకప్​ తర్వాత జట్టుకు దూరంగా ఉన్నాడు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ. రిటైర్మెంట్​ ఊహాగానాలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడలేదీ ఆటగాడు. పలువురు మాజీలు ఇప్పటికే ధోనీ రిటైర్మెంట్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్​ ఈ విషయంపై స్పందించాడు.

"ధోనీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నాడో అతడు మాత్రమే చెప్పాలి. ప్రస్తుతం ధోనీకి 38 ఏళ్లు. టీ20 ప్రపంచకప్​ సమయానికి 39 సంవత్సరాలు వస్తాయి. టీమిండియా ఈ విషయం గురించి ఆలోచించాలి."
-సునీల్ గావస్కర్, టీమిండియా మాజీ ఆటగాడు

టీమిండియాకు ధోనీ అందించిన సేవలు అద్భుతమైనవని ప్రశంసించాడు గావస్కర్. కెప్టెన్​గా జట్టుకు ఎన్నో విజయాలనందించాడని తెలిపాడు.

"ధోనీ పరుగులు సాధించడమే కాకుండా.. వికెట్ల వెనుక మెరుపు స్టంపింగ్స్​తో జట్టుకు ఎన్నో విజయాలనందించాడు. ధోనీకి ఉన్న మిలియన్ల అభిమానుల్లో నేనూ ఒకడిని. కానీ సమయం ఆసన్నమైంది. ఎవరూ వెళ్లమని చెప్పక ముందే అతడే వీడ్కోలు పలికితే బాగుంటుంది."
-సునీల్ గావస్కర్, టీమిండియా మాజీ ఆటగాడు

ప్రపంచకప్​ తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు దూరంగా ఉన్న ధోనీ రిటైర్మెంట్​పై రోజు రోజుకూ ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. ఈ రెండు సిరీస్​లకు ధోనీ స్థానంలో జట్టులోకి వచ్చిన పంత్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు.

ఇవీ చూడండి.. అకిల ధనంజయ బౌలింగ్​పై ఏడాది వేటు

SNTV Digital Daily Planning Update, 0000 GMT
Friday 20th September 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction after Manchester United defeat FC Astana 1-0 in Europa League. Already moved.
SOCCER: Coaches react after Arsenal win 3-0 at Eintracht Frankfurt. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0000 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Oct 1, 2019, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.