ETV Bharat / sports

టీమ్​ఇండియా జెర్సీపై ఆ మూడు నక్షత్రాలు ఎందుకంటే?

author img

By

Published : Nov 29, 2020, 11:16 AM IST

టీమ్​ఇండియా కొత్త(రెట్రో) జెర్సీ గురించి సోషల్​ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. ఆ జెర్సీపై మూడు నక్షత్రాలు ఎందుకున్నాయి? వాటి కథేంటి? అని ఆరా తీస్తున్నారు.

The reason behind three stars on Team India's retro jersey
టీమ్​ఇండియా జెర్సీపై ఆ మూడు నక్షత్రాలు ఎందుకు?

మనదేశంలో క్రికెట్​ను ఆటలా కాకుండా మతంలా చూస్తారు. క్రికెట్​తో పాటు ఆటగాళ్లకు సంబంధించిన ఏ విషయమైన అభిమానులకూ ఆసక్తికరమే. ఈ క్రమంలోనే టీమ్ఇండియా కొత్త జెర్సీ గురించి సోషల్​మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. జెర్సీపైన బీసీసీఐ లోగోకి పైన ఉన్న మూడు నక్షత్రాలు ఎందుకు పెట్టారా? అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అవి ఎందుకు ఉన్నాయంటే?

The reason behind three stars on Team India's retro jersey
శ్రేయస్​ అయ్యర్​ (వృత్తంలో మూడు నక్షత్రాలు)

మూడు ప్రపంపచకప్​లకు గుర్తుగా

భారత్ ఇప్పటివరకు మూడు ప్రపంచకప్​లను గెలుచుకుంది. కపిల్​ దేవ్​ సారథ్యంలో 1983 ప్రపంచకప్.. ఆ తర్వాత ధోనీ నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచ​కప్​, 2011 వన్డే ప్రపంచకప్​ గెలుచుకుంది. దీంతో టీమ్​ఇండియా ఖాతాలో మూడు ప్రపంచకప్​లు చేరాయి. దీనికి గుర్తుగానే జెర్సీలపై ఈ మూడు నక్షత్రాలను ముద్రించినట్లు తెలుస్తోంది. అలాంటి ప్రతిష్ఠాత్మక జెర్సీని ధరించడం తమకు దక్కిన అదృష్టమని ఆసీస్​తో తొలి వన్డేకు ముందు కెప్టెన్​ కోహ్లీ చెప్పాడు.

"మా జట్టుపై కోట్లాది మంది అభిమానుల ఆశలు ఉన్నాయని తెలుసు. అందుకే ఎంతో బాధ్యతగా జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఆటలో ఒత్తిడి ఎప్పుడూ ఉండేదే. అయితే జెర్సీపై మూడు నక్షత్రాలు.. టీమ్​ఇండియా అంటే ఏంటో, వాళ్లు ఏం సాధించారో సూచిస్తుంది. మూడు ప్రపంచకప్​లు సాధించిన జట్టులో భాగం కావడం నాకు దక్కిన గౌరవం" అని సారథి కోహ్లీ అన్నాడు.

ఇదీ చూడండి: టీమ్​ఇండియా జెర్సీ మార్పు వెనకున్న కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.