ETV Bharat / sports

'ప్రేక్షకులకు లేని క్వారంటైన్​ మాకెందుకు?'

author img

By

Published : Jan 4, 2021, 1:00 PM IST

మూడో టెస్టుకు ప్రేక్షకులను అనుమతించి.. తమను మాత్రం 'జూ'లో జంతువుల్లా చూడడం సరికాదని టీమ్ఇండియా ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. స్టేడియానికి వచ్చే వారికి స్వేచ్ఛ ఇచ్చి.. మ్యాచ్​లు ఆడే క్రీడాకారులను క్వారంటైన్​లో ఉంచడం బాగోలేదని అంటున్నారు.

Team India unhappy with hotel quarantine ahead of Sydney Test
'ప్రేక్షకులు లేని క్వారంటైన్​ మాకు ఎందుకు?'

సిడ్నీలో నిర్వహించే మూడో టెస్టుకు ప్రేక్షకులను అనుమతించినా.. క్రికెటర్లను నిర్బంధించి మ్యాచ్​లు నిర్వహించడం బాగోలేదని టీమ్ఇండియా ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. స్టేడియంలో దాదాపుగా 20 వేల మందికి స్వేచ్ఛనిచ్చి.. ఆటగాళ్లను 'జూ'లో జంతువుల్లా చూడటం సరికాదని అంటున్నారు. ​

"సిడ్నీ టెస్టులో మ్యాచ్​ చూసేందుకు ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. కానీ, ఆటగాళ్లను మాత్రం హోటల్​లో నిర్బంధించి మ్యాచ్​లు నిర్వహిస్తున్నారు. అది కూడా మాకు కరోనా టెస్టుల్లో నెగిటివ్​గా వచ్చినా ఇలా చేయడం సమ్మతం కాదు. మమ్మల్ని 'జూ'లో జంతువుల్లా చూడడం మాకు నచ్చలేదు" అని టీమ్ఇండియా ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే కొంతమంది క్రికెటర్లు కరోనా నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణల మధ్య.. ఆటగాళ్లకు క్రికెట్​ ఆస్ట్రేలియా కొత్త ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని.. ఎట్టి పరిస్థితిలో తమకు కేటాయించిన రూమ్​/ఫ్లోర్​ వదిలి వెళ్లకూడదని ఆదేశించింది. అయితే వాటిని పాటించేందుకు టీమ్ఇండియా విముఖత చూపిస్తోంది.

మూడో టెస్టుకు ముందు ఆదివారం చేసిన వైద్య పరీక్షల్లో ఇరుజట్ల ఆటగాళ్లకు కరోనా నెగిటివ్​గా తేలింది. దీంతో టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మైదానంలో దిగడం దాదాపు ఖరారైంది.

ఇదీ చూడండి: కరోనా ప్రభావం.. సిడ్నీ టెస్టుకు 25 శాతం మందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.