ETV Bharat / sports

'కరోనా విముక్తి కోసం అతడిని అడుగుతా'

author img

By

Published : Jul 12, 2020, 7:39 PM IST

Updated : Jul 12, 2020, 8:05 PM IST

Team India fast bowler Bhuvneshwar Kumar Intraction with his fans on Twitter #AskBhuvi
బౌలర్ భువనేశ్వర్ కుమార్

అభిమానులతో ట్విట్టర్​ వేదికగా చర్చించిన బౌలర్ భువనేశ్వర్ కుమార్.. వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమిచ్చాడు. హైదరాబాద్​ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఒకవేళ జీనీ ప్రత్యక్షమైతే కరోనా నుంచి విముక్తి చేయమని కోరతానని అన్నాడు.

కరోనా లాక్​డౌన్​ సడలింపులతో క్రీడా కార్యక్రమాలన్నీ తిరిగి ప్రారంభమవుతున్నాయి. భారత్​లో మాత్రం టోర్నీలు, మ్యాచ్​లు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. భౌతిక దూరం, వైరస్​ నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తూ.. ఆటగాళ్ల శిక్షణా శిబిరాలు నిర్వహించుకోవచ్చని కేంద్రం తెలిపింది.

ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటూ తమ ఫిట్​నెస్​ కోసం కసరత్తు చేస్తున్నారు టీమ్​ఇండియా క్రికెటర్లు. ఇందులో భాగంగానే ఇంట్లో జిమ్​, ఆరుబయట రన్నింగ్​ చేస్తున్నట్లు చెప్పాడు పేసర్​ భువనేశ్వర్​ కుమార్​. ట్విట్టర్​లో #ఆస్క్​భువీ కార్యక్రమంలో భాగంగా అభిమానులతో ముచ్చటించాడు. వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

అన్ని ఫార్మాట్లలో మీరు తీసిన వాటిలో ఎప్పటికీ గుర్తుండిపోయే వికెట్లు?

భువనేశ్వర్​ : మూడు ఫార్మాట్లలో నేను సాధించిన తొలి వికెట్​. (నవ్వుతూ)

తొలి ఓవర్​ బౌలింగ్​ మీకు లేదా బుమ్రాకు ఇవ్వాలని ఎలా నిర్ణయిస్తారు?

భువనేశ్వర్​ : అది కెప్టెన్​ నిర్ణయం.

డెత్​ ఓవర్లలో బౌలింగ్​ చేయడానికి వెళ్లినప్పుడు మీరు భయపడే బ్యాట్స్​మన్​ ఎవరు?

భువనేశ్వర్​ : ఏ బ్యాట్స్​మన్​ అంటే భయం లేదు కానీ, అందరిపై గౌరవం ఉంది.

లాక్​డౌన్ ముగిసిన తర్వాత మీరు వెళ్లే మొదటి ప్రదేశం ఏది?

భువనేశ్వర్​ : ప్రాక్టీసు కోసం క్రికెట్​ గ్రౌండ్​కు వెళతాను.

Team India fast bowler Bhuvneshwar Kumar Intraction with his fans on Twitter #AskBhuvi
భువనేశ్వర్​ కుమార్​

ప్రస్తుత పరిస్థితుల్లో ఫిట్​గా ఉండటానికి మీరు ఏం చేస్తారు? మీకు నచ్చే కసరత్తులేమిటి?

భువనేశ్వర్​ : బాల్కానీలో జిమ్​, ఇంటి వెనుకున్న ఖాళీ ప్రదేశంలో రన్నింగ్​ చేస్తున్నా. వెయిట్​ లిఫ్టింగ్​ను ఎక్కువగా ఇష్టపడతాను.

ఐపీఎల్​లో మీకు బాగా గుర్తుండిపోయే జ్ఞాపకం?

భువనేశ్వర్​ : 2016లో ఐపీఎల్​ టైటిల్​ నెగ్గడం.

హైదరాబాద్​ గురించి ఓ మంచి విషయం?

భువనేశ్వర్​ : నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. ఒక్క దాన్ని ఎంచుకోవడం కష్టం.

లాక్​డౌన్​లో మీరు నేర్చుకున్న కొత్త విషయం?

భువనేశ్వర్​ : కొన్ని ఇంటి పనులను నేర్చుకున్నా.

క్రికెట్​ కాకుండా మీకు నచ్చే క్రీడ?

భువనేశ్వర్​ : ఫుట్​బాల్​, బ్యాడ్మింటన్​

క్రికెట్​లో బంతికి లాలాజల నిషేధం అమలులో ఉండటం వల్ల బౌలింగ్​ కష్టమవుతుందని మీరు అనుకుంటున్నారా? ముఖ్యంగా రెడ్​బాల్​ క్రికెట్​లో? ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​ వంటి చల్లటి వాతావరణం గల దేశాల్లో చెమట లేకుండా బౌలింగ్​ ఎలా చేయగలరు?

భువనేశ్వర్​ : ప్రపంచంలోని ప్రతిచోటా చెమట పట్టడం సాధ్యం కాదు. బౌలర్లకు ఇది కచ్చితంగా సవాలుగా ఉంటుంది. త్వరలోనే వీటన్నిటికి మార్గం దొరుకుందని ఆశిస్తున్నా.

ఒకవేళ మీకు అల్లాదీన్​ దీపం దొరికితే మీరు కోరుకునే మూడు ఏంటి?

భువనేశ్వర్​ :

1) ప్రపంచాన్ని కరోనా నుంచి విముక్తి చేయాలని.

2) అత్యవసర పరిస్థితి కోసం ఓ కోరికను నా దగ్గరే ఉంచుకుంటా.

3) అందులో ఉన్న జీనీకి శాశ్వత స్వేచ్ఛను కలిగిస్తాను.

Last Updated :Jul 12, 2020, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.