ETV Bharat / sports

సచిన్​ బ్యాట్​తో అఫ్రిది సెంచరీ చేసిన వేళ

author img

By

Published : Aug 3, 2020, 3:47 PM IST

అరంగేట్ర సిరీస్​లోనే అద్భుతమైన ఇన్నింగ్స్​తో షాహిద్​ అఫ్రిది ఆకట్టుకున్నాడని పాక్ మాజీ ఆల్​రౌండర్​ అజహర్ మహ్మద్ చెప్పాడు​. అతడు ఆడిన రెండో మ్యాచ్​లోనే కేవలం 37 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడని తెలిపాడు.

Shahid Afridi used Sachin Tendulkar's bat to score 37-ball ton, reveals Mahmood
సచిన్​ బ్యాట్​తో షాహిద్​ అఫ్రిది సెంచరీ!

షాహిద్​ అఫ్రిది తొలి అంతర్జాతీయ సిరీస్​ను గుర్తు చేసుకున్నాడు పాకిస్థాన్​ మాజీ ఆల్​రౌండర్​ అజహర్ మహ్మద్​. అందులోని ఓ మ్యాచ్​లో సచిన్ బ్యాట్​తో 36 బంతుల్లో సెంచరీ చేసిన విషయాన్ని వెల్లడించాడు.

"1996లో సహారాకప్​ తర్వాత నైరోబిలో సెంటెనరీ టోర్నీతో​ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు అఫ్రిది. అదే సిరీస్​తో నేను అడుగుపెట్టాను. అందులో తొలుత ముస్తాక్​ అహ్మద్​ ఆడాల్సింది. కానీ గాయం కారణంగా అతడికి విశ్రాంతినిచ్చారు. ఆ సమయంలో అఫ్రిది, పాకిస్థాన్​-ఏ జట్టుతో వెస్టిండీస్​ పర్యటనలో ఉన్నాడు. దాంతో ముస్తాక్ స్థానాన్ని అఫ్రిదితో భర్తీ చేశారు. ఆ రోజుల్లో మూడులో ఆడే బ్యాట్స్​మన్​ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం. ఆ స్థానంలో అఫ్రిదిని, నన్ను, వసీంను ఆడమని చెప్పారు. ప్రాక్టీసులో స్పిన్నర్లను ఉతికి ఆరేశాడు ఆఫ్రిది.. లంకతో మ్యాచ్​లోనూ అలాంటి ప్రదర్శనే ఇవ్వడం వల్ల మేం గెలిచాం. ఆరోజు సచిన్​ ఇచ్చిన బ్యాట్​తో కేవలం 37 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేశాడు అఫ్రిది. ఇకపై మూడో స్థానంలో అఫ్రిదిని ఆడించాలని అప్పుడే నిర్ణయించాం" -అజార్​ మహమూద్​, పాకిస్థాన్​ మాజీ ఆల్​రౌండర్​

శ్రీలంక, పాకిస్థాన్​, దక్షిణాఫ్రికా, కెన్యా జట్లు కలిసి 1996లో నైరోబీలో సెంటెనరీ టోర్నీలో పాల్గొన్నాయి. ఈ సిరీస్​లో అఫ్రిది కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేయగా, 2014లో ఈ రికార్డును న్యూజిలాండ్​కు చెందిన కోరీ అండర్సన్​ (36 బంతుల్లో) అధిమగించాడు. ఆ తర్వాత 2015 ప్రపంచకప్​లో వెస్టిండీస్​పై కేవలం 31 బంతుల్లోనే శతకం చేశాడు ఏబీ డివిలియర్స్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.