ETV Bharat / sports

ఐపీఎల్​: చెన్నై సూపర్​కింగ్స్​పై రోహిత్​ రికార్డులు

author img

By

Published : Sep 19, 2020, 8:59 AM IST

ముంబయి-చెన్నై మధ్య ఈ సీజన్​లో తొలి మ్యాచ్​ జరగనుంది. ఈ క్రమంలో ధోనీసేనపై రోహిత్ శర్మ ఇప్పటివరకు చేసిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

Rohit
రోహిత్

నేటి(సెప్టెంబరు 19) నుంచి ఐపీఎల్ సందడి ప్రారంభం కానుంది. నాలుగుసార్లు ట్రోఫీ గెల్చుకున్న ముంబయి ఇండియన్స్​.. తొలి మ్యాచ్​లో చెన్నైసూపర్​ కింగ్స్​తో తలపడనుంది. గతంలో ఇరుజట్ల మధ్య చాలా మ్యాచ్​లు జరిగాయి. అందులో ముంబయి కెప్టెన్​ రోహిత్​ శర్మ ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?

అత్యధిక పరుగులు​ సాధించిన రెండో ఆటగాడు

చెన్నైసూపర్​కింగ్స్​తో ఇప్పటివరకు 27 మ్యాచ్​లాడి 705 పరుగులు చేశాడు. ధోనీ సేనపై ఏడు వందల పరుగుల మార్క్​ను అందుకున్న రెండో క్రికెటర్​గా నిలిచాడు. అతడి కంటే ముందు కోహ్లీ ఉన్నాడు.

Rohit
రోహిత్ శర్మ

అత్యధిక ఫోర్స్​లో రెండో స్థానం

సీఎస్కేపై రోహిత్​ 54 ఫోర్లు బాదాడు. చెన్నై జట్టుపై అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శిఖర్​ ధావన్​(70) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. 25 సిక్సర్లతో ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

మీకు తెలుసా?

అత్యధిక అర్ద సెంచరీలు

చెన్నై జట్టుపై రోహిత్​ ఇతర బ్యాట్స్​మన్​ కంటే అత్యధికంగా ఏడు అర్ధ సెంచరీలు చేశాడు. కోహ్లీ, ధావన్​, వార్నర్​లు(6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Rohit
ముంబయి ఇండియన్స్​

ఉత్తమ కెప్టెన్సీ రికార్డు

ధోనీసేనపై అత్యధిక మ్యాచ్​లకు కెప్టెన్​గా ఉన్న రోహిత్ శర్మ.. 62.50 సగటుతో 10 సార్లు గెలిపించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.