ETV Bharat / sports

'భారత్-ఏ​ ఎలా గెలిచిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు'

author img

By

Published : Jan 20, 2021, 10:00 AM IST

Updated : Jan 20, 2021, 11:44 AM IST

సిరీస్​ను సొంతం చేసుకోవడానికి భారత్​కు అర్హత ఉందని చెప్పిన ఆసీస్​ మాజీ సారథి రికీ పాంటింగ్​.. టీమ్​ఇండియా ఎలా గెలిచిందో ఇప్పటికీ తనకు అర్థం కావట్లేదని అన్నాడు.

ponting
పాంటింగ్​

ఆస్ట్రేలియాపై విజయం సాధించిన టీమ్​ఇండియాను ప్రశంసించాడు ఆసీస్​ మాజీ సారథి రికీ పాంటింగ్​. సిరీస్​ గెలవడానికి భారత్​కు అర్హత ఉందని అన్నాడు. అయితే టీమ్​ఇండియా గెలవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు. జట్టులో చాలా మందికి గాయాలయ్యాయని.. అది భారత్​-ఏ జట్టని అభిప్రాయపడ్డాడు.

"ఆస్ట్రేలియాపై భారత్​ నెగ్గడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సిరీస్​ గెలవడానికి భారత్​కు అర్హత ఉంది. తొలి టెస్టు తర్వాత టీమ్​ఇండియాకు సారథి కోహ్లీ గైర్హాజరీ, ఎక్కువ గాయాలు వెంటాడాయి. మరోవైపు ఆసీస్​కు బలమైన ఆటగాళ్లు ఉన్నారు. వార్నర్​ చివరి రెండు మ్యాచులకు అందుబాటులోనే ఉన్నాడు. అయినా మా గడ్డపై వారు ఎలా గెలిచారో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఏదేమైనప్పటికీ టీమ్​ఇండియా కీలక సమయాల్లో బాగా ఆడింది. కానీ ఆసీస్​ అలా చేయలేకపోయింది. అదే ఇరు జట్లకు తేడా."

-పాంటింగ్​, ఆసీస్​ మాజీ సారథి.

2-1తేడాతో టెస్టు సిరీస్​ను సొంతం చేసుకుని.. చారిత్రక విజయాన్ని నమోదు చేసింది టీమ్​ఇండియా. దీంతో సర్వత్రా భారతజట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇదీ చూడండి : అద్భుత ప్రదర్శనపై సిరాజ్​ భావోద్వేగం

Last Updated : Jan 20, 2021, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.