ETV Bharat / sports

పంత్ ఏంటిది? ఒకేరోజు రెండు క్యాచ్​లు మిస్

author img

By

Published : Jan 7, 2021, 2:02 PM IST

వికెట్ కీపింగ్​లో నిరాశపరుస్తున్న పంత్.. ఆసీస్​తో మూడో టెస్టులో క్యాచుల్ని వదిలేయడం మేనేజ్​మెంట్​ను కలవరపెడుతోంది. దీంతో అతడిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

pant dropped two catches
ఏంటిది పంత్?.. మూడో టెస్టులో రెండు క్యాచ్​లు మిస్

టీమ్​ఇండియా కీపర్​ రిషబ్ పంత్.. వికెట్ కీపింగ్​లో తన లోపాలను బయటపెడుతూనే ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి రోజు, ఒకే బ్యాట్స్​మన్​ ఇచ్చిన రెండు క్యాచ్​లు జారవిడిచి నిరాశపరిచాడు. ఫలితంగా ఆస్ట్రేలియా యువ ఆటగాడు విల్​ పకోస్కీ అర్ధశతకం సాధించాడు. దీంతో విసిగిపోయిన నెటిజన్లు ట్విట్టర్​లో అతడిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

22వ ఓవర్లో స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్ వేసిన బంతి.. పకోస్కీ బ్యాట్​ అంచున తాకి నేరుగా పంత్ వైపు వెళ్లింది. చేతుల్లోకి వచ్చిన బాల్​ను అందుకోలేకపోయాడు. దీంతో అతడి వైపు అసంతృప్తిగా చూశాడు అశ్విన్.

సరిగ్గా నాలుగు ఓవర్ల తర్వాత పేసర్​ సిరాజ్​​ బౌన్సర్​కు తికమకపడిన పకోస్కీ.. బాల్​ను గాల్లోకి లేపాడు. తొలుత పంత్​ క్యాచ్​ పట్టాడనుకొని అంపైర్లు ఔటిచ్చారు. కానీ బంతి నేలను తాకిన తర్వాత చేతుల్లోకి తీసుకున్నాడని తేలింది. దీంతో బ్యాట్స్​మన్​కు మరోసారి అదృష్టం కలిసొచ్చింది. పకోస్కీ, లబుషేన్​ల అర్ధశతకాలు చేయడం వల్ల తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 166/2తో నిలిచింది ఆసీస్​.

ఈ నేపథ్యంలో పంత్​, సీనియర్ వికెట్ కీపర్ సాహా విషయమై మరోసారి చర్చ పెడుతున్నారు నెటిజన్లు. వీరిద్దరిలో సాహా మంచి వికెట్​ కీపర్​ అని, పంత్ కాస్త మెరుగైన బ్యాట్స్​మన్ అని అంటున్నారు. కొన్ని పరుగుల కోసం క్యాచ్​ల్ని జారవిడిచే కీపర్​ ఎంతవరకు అవసరమని అంటున్నారు.

నెటిజన్ల వ్యాఖ్యలు...

  • I'm planning to keep a good health in 2021. Hence I have decided to restrain from watching #RishabhPant playing cricket #INDvsAUSTest

    — Kaushik Rajaraman (@iamkaushikr) January 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • If 20 wickets are mandatory to win a test than we need to have a specialist keeper. Even when #RishabhPant is in the playing 11. Wicket-keeping doesn't come naturally to him. Even his fitness is atrocious for the skill. #Saha should be keeping for India in tests.

    — Pale Blue Dotter (@lajababu) January 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Instead of doing summersaults like a fat balloon in 'lab' Rishabh Pant should spend time with Saha on his improving his wicket keeping.

    When there is not much difference between two teams, every single catch or run can b crucial. #AusvsInd #IndvsAus #RishabhPant #Pant #Ashwin

    — Dilli se (@kiroriwalanuj) January 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: పకోస్కీ, లబుషేన్ అర్ధశతకాలు.. తొలిరోజు ఆసీస్​దే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.