ETV Bharat / sports

మహేంద్రసింగ్​ ధోనీపై పాక్​ క్రికెటర్ల ప్రశంసలు

author img

By

Published : Aug 18, 2020, 1:16 PM IST

భారత క్రికెట్​ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై పాకిస్థాన్‌ క్రికెట్​ సంఘం స్పందించింది. ప్రపంచంలోనే మహీ గొప్ప ఆటగాడిగా ప్రశంసించారు దాాయాది​ క్రికెటర్లు.

pakistan cricket fraternity salutes dhoni for impactful careerpakistan cricket fraternity salutes dhoni for impactful career
ధోనీ

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనీపై పాకిస్థాన్​ క్రికెట్​ సంఘం ప్రశంసలు కురిపించింది. భారత జట్టుకు దిశానిర్దేశం చేసిన గొప్ప సారథుల్లో​ ధోనీ ఒకరని కితాబిచ్చారు పాక్​ ఆటగాళ్లు. తనదైన శైలిలో ఆటను ప్రభావితం చేసిన వ్యక్తిగా అభివర్ణించారు. ఆగస్టు 15న.. మహేంద్రుడు అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు.

ఈ సందర్భంగా పాకిస్థాన్​ స్టార్​ క్రికెటర్లు ఇంజమామ్​-ఉల్​-హక్​, బసిత్​ ఆలీ, వసీమ్​ అక్రమ్​, వకార్​ యూనిస్​, ముదస్సార్​​ నాజర్​, షాహిద్​ అఫ్రిది తదితరులు ధోనీపై తమకున్న అపారమైన గౌరవాన్ని ఎలుగెత్తి చాటారు.


pakistan cricket fraternity salutes dhoni for impactful career
ధోనీ

"భారత్​ నుంచి వచ్చిన గొప్ప కెప్టెన్​లలో ధోనీ ఒకడు. అతను ఎప్పటికీ నా మనస్సులో ఉంటాడు. మాహీకి వ్యతిరేకంగా ఆడేటప్పుడు మ్యాచ్​ను ఆస్వాదిస్తా. అతను నిజమైన మ్యాచ్​ విన్నర్. ​మహీ భారత్‌లోనే కాదు, ప్రపంచంలోనే గొప్ప ఆటగాడు. క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఒక్కడే మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించాడు."

ఇంజమామ్​, పాక్​ క్రికెటర్​

భారత క్రికెట్​లో ధోనీ శకం ఎప్పటికీ గుర్తుండిపోతుందని రషీద్​ లతీఫ్​​ అభిప్రాయపడ్డాడు. "అద్భుతమైన ఆటగాడు, కెప్టెన్​. ఆటను క్షుణ్నంగా పరిశీలించి.. పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లను ఉపయోగించడంలో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి ధోనీ. మ్యాచ్​ ముగింపులో నంబర్​-1. గతేడాది ప్రపంచకప్​ సెమీ ఫైనల్​లో న్యాయం చేయలేదని అతనిపై ఎన్నో విమర్శలొచ్చాయి. కానీ, క్లిష్ట సమయాల్లో అతను ఎంతో శ్రమించాడు." అని లతీఫ్​ తెలిపాడు.

pakistan cricket fraternity salutes dhoni for impactful career
ధోనీ

మాజీ టెస్టు ఓపెనర్​, ముదస్సార్ నాజర్ మాట్లాడుతూ.. "నేను కెన్యాలో కోచింగ్​లో ఉన్నప్పుడు మొదటిసారి ధోనీని చూశా. నైరోబీలో జరిగిన త్రైపాక్షిక సిరీస్​లో ధోనీ వరుస సెంచరీలతో విరుచుకుపడ్డాడు. కానీ, ప్రపంచ క్రికెట్​పై ఇంత ప్రభావాన్ని చూపిస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు" అని పేర్కొన్నాడు.

కెప్టెన్​, వికెట్​ కీపర్​ స్థానాల్లో ఉంటూ.. భారీ పరుగులు సాధించగల ధోనీ సామర్థ్యం ఆశ్చర్యకరమని పాకిస్థాన్​ బ్యాట్స్​మన్​ మహమ్మద్​ యూసఫ్​ అన్నాడు. ఇక తన కెరీర్​ మొత్తంలో ధోనీ లాంటి మల్టీ టాలెంటెండ్​ ఆటగాడిని ఎప్పుడూ చూడలేదని బసిత్​ ఆలీ అభిప్రాయపడ్డాడు.

pakistan cricket fraternity salutes dhoni for impactful career
ధోనీ

ఇంకా ఎవరెవరు ఏమన్నారంటే..

రాబోయే యువ ఆటగాళ్లకు ధోనీ స్ఫూర్తి:​ మోహ్సిన్​ ఖాన్​

ధోనీ అన్ని విధాలుగా గౌరవాన్ని పొందేందుకు అర్హమైన వ్యక్తి: మొయిన్​ ఖాన్​

నిజమైన ఆటగాడికి, కెప్టెన్​కు ప్రతిరూపం మహీ: అఫ్రిది

క్రికెట్​ ప్రపంచంలో ధోనీ మార్క్​ ఎప్పటికీ గుర్తుండిపోతుంది: బాబర్​ అజామ్

ధోనీ.. ఐసీసీ ప్రపంచకప్​, టీ20 ప్రపంచ కప్​,​ ఛాంపియన్స్​ ట్రోఫీ టైటిళ్లను గెలిచిన సారథిగా ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ మూడు టైటిళ్ల ఫీట్​ను ఏ దేశ కెప్టెన్​ అందుకోలోదు. మహీ సారథ్యంలోనే టెస్టు క్రికెట్​లో భారత్ నంబర్​.1 స్థానం అందుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.