ETV Bharat / sports

'భారత్​లోని ఆటగాళ్ల భద్రతకు కట్టుబడి ఉన్నాం'

author img

By

Published : Apr 9, 2021, 11:56 AM IST

NZC monitoring travel ban situation and in contact with IPL franchises
'ప్రయాణికుల నిషేధాన్ని పర్యవేక్షిస్తున్నాం'

భారత్లో​ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్​లో పాల్గొనే తమ ఆటగాళ్ల భద్రత కోసం కట్టుబడి ఉన్నామని న్యూజిలాండ్​ క్రికెట్​ సంఘం తెలిపింది. భారత ప్రయాణికులపై న్యూజిలాండ్​ తాత్కాలిక నిషేధం విధించిన క్రమంలో ఈ మేరకు వెల్లడించింది.

భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్​ తాత్కాలిక నిషేధం విధించిన క్రమంలో తమ ఆటగాళ్ల భద్రతపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆ దేశ క్రికెట్ సంఘం. ఐపీఎల్​లో భాగంగా ప్రస్తుతం భారత్​లో ఉన్న తమ ఆటగాళ్ల గురించి ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. క్రికెటర్ల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.

ఇటీవల భారత్​ నుంచి న్యూజిలాండ్​కు వెళ్లిన 23 మంది ప్రయాణికులలో 17 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో ఈ నెల 28 వరకు ప్రయాణికులను తాత్కాలికంగా నిషేధించింది న్యూజిలాండ్​. అయితే ఐపీఎల్​ కోసం ఇండియాలో ఉన్న ఆటగాళ్ల సంక్షేమం గురించి ఎప్పటికప్పుడు భారత్​తో సంప్రదింపులు జరుపుతున్నామని కివీస్ బోర్డు తెలిపింది.

కివీస్​ నుంచి కేన్​ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంటర్, కైల్ జేమీసన్, జిమ్మీ నీషమ్, టిమ్ సీఫెర్ట్​, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గుసన్​ లీగ్​లో పాల్గొంటున్నారు. వీరి పూర్తి బాధ్యత న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుదే అని ప్రధాని జెసిండా ఆర్డర్న్​ చెప్పారు.

ఇదీ చదవండి: 'చావ్లా.. జట్టుకు ఏమివ్వగలడో మాకు తెలుసు‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.