ETV Bharat / sports

హఫీజ్ పోరాటం వృథా.. సిరీస్​ కివీస్​దే

author img

By

Published : Dec 20, 2020, 3:23 PM IST

ఆదివారం పాకిస్థాన్​తో జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో న్యూజిలాండ్ అద్భుత విజయం సొంతం చేసుకుంది. మహ్మద్ హఫీజ్​ ఒంటరి పోరాటం వృథాగా మిగిలింది. దీంతో మరో టీ20 మిగిలుండగానే సిరీస్​ను చేజిక్కించుకుంది కివీస్.

tim seifart kane williamson
హఫీజ్ పోరాటం వృథా.. సిరీస్​ కివీస్​దే

పాకిస్థాన్​తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించింది న్యూజిలాండ్. 9 వికెట్ల తేడాతో గెలుపొంది మూడు మ్యాచ్​ల సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మహ్మద్ హఫీజ్​(99 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్​ వృథా అయిపోయింది.

హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. మహ్మద్ హఫీజ్(57 బంతుల్లో 99 నాటౌట్) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మిగిలిన వారిలో రిజ్వాన్(22) మినహా అందరూ విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో సౌథీ 4, నీషమ్, సోధీ తలో వికెట్ తీశారు.

tim seifart kane williamson
టిమ్ సీఫర్ట్ - కేన్ విలియమ్సన్

అనంతరం కివీస్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సీఫర్ట్(84*), విలియమ్సన్(57*) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఫహీమ్​ అష్రఫ్​ ఒక వికెట్ పడగొట్టాడు.

నాలుగో క్రికెటర్​గా హఫీజ్

40 ఏళ్ల పాక్ ఆల్​రౌండర్ మహ్మద్ హఫీజ్.. ఈ మ్యాచ్​లో చివరి 3 బంతుల్లో 16 పరుగులు చేశాడు. తద్వారా 99 రన్స్​తో నాటౌట్​గా నిలిచాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 99* చేసిన నాలుగో బ్యాట్స్​మన్​గా ఘనత సాధించాడు. ఇతడి కంటే ముందు అలెక్స్ హేల్స్, ల్యూక్ రైట్, డేవిడ్ మలన్ ఉన్నారు.

MHMD HAFIZ
పాక్ ఆల్​రౌండర్ మహ్మద్ హఫీజ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.