ETV Bharat / sports

అతడికి బిజినెస్​ క్లాస్ ఇచ్చి.. ధోనీ మాత్రం అక్కడ?

author img

By

Published : Aug 22, 2020, 10:21 PM IST

మరోసారి పెద్ద మనసును చాటుకున్న ధోనీ.. చెన్నై ఫ్రాంఛైజీ డైరెక్టర్​కు బిజినెస్​ క్లాస్​ టికెట్​ ఇచ్చి,తాను మాత్రం ఎకానమీ క్లాస్​లో ప్రయాణించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

dhoni
ధోనీ

చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ.. మరోసారి అభిమానుల మనసు గెల్చుకున్నాడు. స్టార్​ హోదాలో ఉన్నా సరే ఓ సాధారణ ఆటగాడిలా వ్యవహరించాడు. అంతర్జాతీయ క్రికెట్​కు ఇటీవలే రిటైర్మెంట్​ ప్రకటించిన మహీ.. ఐపీఎల్​ కోసం జట్టుతో పాటు యూఏఈకి వెళ్లాడు. అయితే ప్రత్యేక విమానంలో తనకు కేటాయించిన బిజినెస్​ క్లాస్​ టికెట్​ను ఫ్రాంఛైజీ డైరెక్టర్​ కె.జార్జ్​ జాన్​ కోసం వదులుకుని, ఎకానమీ క్లాస్​లో అందరితో కలిసి కూర్చున్నాడు.

  • When a man who’s seen it all, done it all in Cricket tells you, “Your legs are too long, sit in my seat (Business Class), I’ll sit in Economy.” The skipper never fails to amaze me. @msdhoni pic.twitter.com/bE3W99I4P6

    — george (@georgejohn1973) August 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జాన్​కు పొడవాటి కాళ్లు ఉన్నందున ఎకానమీ క్లాస్​ సీట్​లో అసౌకర్యానికి గురయ్యాడు. దీనిని గమనించిన ధోనీ.. తన సీటును అతడికి మనసు చాటుకున్నాడు. ఈ వీడియోను జాన్​ స్వయంగా ట్వీట్ చేశాడు. దీంతో ధోనీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.