ETV Bharat / sports

కావాలనే ధోనీ తలపైకి బంతి విసిరిన అక్తర్​!

author img

By

Published : Aug 8, 2020, 7:19 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీకి ఒకసారి ఉద్దేశపూర్వకంగానే తలపైకి బంతి విసిరినట్లు పాకిస్థాన్​ పేసర్​ షోయబ్​ అక్తర్​ తెలిపాడు. 2005లో ఇరు దేశాల జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్​లో ఈ సంఘటన జరిగినట్లు గుర్తు చేసుకున్నాడు.

MS Dhoni
ధోనీ

ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన పాకిస్థాన్​ మాజీ పేసర్​ షోయబ్​ అక్తర్​. అయితే, ఒకానొక సమయంలో భారత మాజీ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీకి ఉద్దేశపూర్వకంగా నేరుగా తలపైకి బంతిని (బీమర్) విసిరినట్లు తెలిపాడు. భారత్​, పాక్​ జట్ల మధ్య 2006 ఫైసలాబాద్​ టెస్టు మ్యాచ్​ సందర్భంగా ఈ సంఘటన జరిగిందని అక్తర్​ గుర్తుచేసుకున్నాడు.

ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధోనీ తన బౌలింగ్​లో అద్భుత ప్రదర్శన కనబరచడం వల్ల ఒత్తిడితో ఉద్దేశపూర్వకంగానే బీమర్​​ వేసినట్లు వెల్లడించాడు.

"1997లో నా మోకాలు పూర్తిగా దెబ్బతిని.. పనికిరానివిగా మారాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా ఆడాలని నిర్ణయించుకున్నా. అందుకోసం ఇంజక్షన్ల సాయం తీసుకున్నా. టీమ్​ఇండియా పాకిస్థాన్​లో పర్యటించిన సమయానికి నా కాలు ఫైబులా ఎముక విరిగింది. ఫైసలాబాద్​లో జరిగిన మ్యాచ్​లో ధోనీ అద్భుతంగా రాణించాడు. అప్పటికే మ్యాచ్​ ఆడేందుకు ఇంజక్షన్లు ఉపయోగించా. ఇదే నా చివరి టెస్టు మ్యాచ్​ అని నిర్ణయించుకున్నా. అప్పుడే ఉద్దేశపూర్వకంగా తలపైకి బంతిని విసిరా."

-షోయబ్​ అక్తర్​, పాక్ మాజీ​ బౌలర్​

ఆ తర్వాత ధోనీకి క్షమాపణలు చెప్పినట్లు అక్తర్​ వెల్లడించాడు. "నా జీవితంలోనే మొదటి సారి నేను కావాలనే బీమర్​ వేశా. అందుకు చాలా బాధగా ఉంది. కానీ నేను వేసే ప్రతి బంతినీ ధోనీ వదలడం లేదు. బహుశా నేను విసుగు చెందా అనుకుంటున్నా" అని పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్​లో ధోనీ 153 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 148 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్​ డ్రాగా ముగిసింది. అయితే, చివరి మ్యాచ్​లో పాక్​ గెలిచి 1-0తో తేడాతో ట్రోఫీ కైవసం చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.