ETV Bharat / sports

ధోనీ గ్యారేజీలోకి మరో అరుదైన కారు

author img

By

Published : Aug 18, 2020, 2:57 PM IST

Updated : Aug 18, 2020, 3:27 PM IST

వాహనాల సేకరణపై ఎంతో ఆసక్తి ఉన్న ధోనీ.. తాజాగా తన గ్యారేజీలోకి మరో అరుదైన కారును చేర్చాడు. దానికి సంబంధించిన వీడియోను అతని భార్య సాక్షి ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది.

MS Dhoni
ధోనీ

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీకి.. బైక్​, కార్ల పట్ల ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గ్యారేజీ​లోకి అడుగుపెడితే ఎన్నో రకాల వాహనాలు దర్శమిస్తాయి. తాజాగా ధోనీ సేకరణలో మరో కారు చేరినట్లు తెలుస్తోంది. అతని భార్య సాక్షి సింగ్​ ఈ కారుకు సంబంధించిన వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసింది.

"వెల్కమ్​ టూ హోమ్​.. రెడ్​ బీస్ట్​. ధోనీ ఇదిగో నీ కొత్త బొమ్మ. నిన్ను చాలా మిస్​ అవుతున్నా". అంటూ రాసుకొచ్చింది.

పోంటియాక్​ ఫైర్​బర్డ్​గా పిలిచే ఈ కారు చాలా అరుదైనది. మన దేశంలోని రోడ్లపై చాలా తక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు, లెఫ్ట్​హ్యాండ్​ డ్రైవ్​ దీని ప్రత్యేకత. పాతకాలం నాటి ఈ కారు సుమారు రూ.68 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇప్పటికే ధోనీ గ్యారేజీలో చాలా రకాల వాహనాలు కొలువై ఉన్నాయి. ఫెరారీ 599 జీటీఓ, హమ్మర్​ హెచ్​2, జీఎంసీ సియెర్రా బ్రాండ్​లకు మాహీ యజమాని. ఇక ద్విచక్ర వాహనాల్లో కవాసాకి నింజా హెచ్​2, కాన్ఫెడరేట్​ హెల్కాట్​, బీఎస్​ఏ, సుజుకి హయాబుషా ఉన్నాయి.

ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు చెప్పాడు మాహీ. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు ధోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్​లో సీఎస్కే జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. సెప్టెంబరు 19న లీగ్​ ప్రారంభం కానుంది.

Last Updated : Aug 18, 2020, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.