ETV Bharat / sports

టీమ్​ఇండియా ప్రదర్శనపై 'మాజీ సారథి' యూటర్న్​

author img

By

Published : Jan 18, 2021, 11:40 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్​ఇండియా ఘోరంగా విఫలమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసిన ఇంగ్లాండ్​ మాజీ సారథి మైకేల్​ వాన్​.. తన మాటను వెనక్కి తీసుకున్నాడు. టీమ్​ఇండియా ఆటతీరుకు తాను ముగ్ధుడైనట్లు చెప్పాడు. ఈ సిరీస్​లో భారత జట్టు ఆటతీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నాడు.

van
వాన్

"అన్ని ఫార్మాట్లలో టీమ్​ఇండియా ఓడిపోవడం ఖాయం. వైట్​వాష్ పక్కా. ఇందులో సందేహమే లేదు. కోహ్లీ గైర్హాజరీ భారత జట్టుకు అతిపెద్ద లోటు." ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరేముందు నుంచి భారత జట్టు గురించి ఆసీస్​ సహా మిగతా జట్లకు చెందిన పలువురు మాజీలు అన్న మాటలివి. కానీ ఇప్పుడు వారంతా తామన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నారు. వారిలో ఇంగ్లాండ్​ మాజీ సారథి మైకేల్​ వాన్ ఒకడు​. ఎందుకంటే ఆ వ్యాఖ్యలను పటాపంచలు చేస్తూ టీమ్​ఇండియా ఆడుతోన్న తీరు అద్భుతం.

  • Full credit to India ... The character they have had to show on this tour has been remarkable ... also the resilience with so many injuries ... a team is only as good as its bench many say ... Well India have a very strong bench of players now ... #AUSvIND

    — Michael Vaughan (@MichaelVaughan) January 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తొలుత టీమ్​ఇండియా అన్ని ఫార్మాట్లలో ఓడిపోతుందన్నాడు మైకేల్​. కానీ టీ20 సిరీస్​ను భారత్​ జట్టు కైవసం చేసుకోగానే కొంచెం రూట్​ మార్చాడు. 'అస్సలు ఊహించలేదు టీమ్​ఇండియా గెలుస్తుందని" అని అన్నాడు.

అయితే టెస్టు సిరీస్​లో భారత్​ 4-0తేడాతో ఓడిపోతుందని ధీమా వ్యక్తం చేశాడు. మళ్లీ వాటిని కూడా తిప్పికొట్టేలా భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. తొలి టెస్టులో ఓడినా.. సారథి కోహ్లీ లేకుండానే రెండో(మెల్​బోర్న్​) టెస్టులో తాత్కాలిక సారథి రహానె నేతృత్వంలో అదరగొట్టారు. మూడో టెస్టును డ్రాగా ముగించారు. పర్యటనకు ముందు నుంచి గాయాలతో చివరి మ్యాచ్​ వరకు ప్రధాన ఆటగాళ్లు దూరమవుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బెంచ్​ ఆటగాళ్లతో నాలుగో మ్యాచులోనూ తొలి ఇన్నింగ్స్​ అద్భుతంగా ఆడి మాజీల ప్రశంసలు పొందారు.

ఎప్పటికీ గుర్తుండిపోతుంది: వాన్​

దీంతో మైకేల్​ వాన్ కూడా​ యూటర్న్​ తీసుకోక తప్పలేదు. భారత ఆటగాళ్లను ప్రశంసించడం ప్రారంభించాడు. డీలాపడ్డా వారు తిరిగి పుంజుకున్నే విధానానికి తాను ముగ్ధుడైనట్లు తెలిపాడు. "ఈ పర్యటనలో ఘనతంతా భారత జట్టుదే. వారు ఆడిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎన్నో గాయాలను ఎదుర్కొన్నప్పటికీ తిరిగి పుంజుకునే విధానం అద్భుతం. భారత్​కు బలమైన బెంచ్​ ఆటగాళ్లు ఉన్నారు. రహానె సారథ్యం, సుందర్​, ఠాకూర్​ గొప్పగా ఆడారు" అని కొనియాడాడు.

  • Early call ... I think Australia will beat India this tour in all formats convincingly ... #AUSvIND

    — Michael Vaughan (@MichaelVaughan) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Got my prediction slightly wrong ... India lost the ODI series ... Have Won the T20 series which I didn’t predict ... But they will lose the Test series ... #OnOn #2out3aintBad #AUSvIND

    — Michael Vaughan (@MichaelVaughan) December 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Told ya ... India are going to get hammered in the Test Series ... #AUSvIND #4-0

    — Michael Vaughan (@MichaelVaughan) December 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Congrats India .. Winning against the odds is always special .. Has to be the best all round performance by a Captain we have witnessed for many many years .. well done @ajinkyarahane88 .. also @RealShubmanGill is going to be a star .. #AUSvIND !

    — Michael Vaughan (@MichaelVaughan) December 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి : గబ్బా టెస్టు: 182 పరుగుల ఆధిక్యంలో ఆసీస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.