ETV Bharat / sports

సాండ్​ ఆర్ట్​తో ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు

author img

By

Published : Jul 7, 2020, 2:44 PM IST

ధోనీ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి మానస్​ సాహో అతడికి శుభాకాంక్షలు తెలిపారు. పూరిలో యానిమేటెడ్​ శాండ్​ ఆర్ట్​తో మహీ చిత్రాన్ని రూపొందించాడు.

Mahi's birthday wishes through sand art animation
ధోనీ

సాండ్​ ఆర్ట్​తో ధోనీకి పుట్టనిరోజు శుభాకాంక్షలు

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా క్రికెటర్లు, సన్నిహితులతో సహా అభిమానుల నుంచి మహీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తాజాగా, ప్రముఖ సైకత శిల్పి మానస్​ సాహో ధోనీకి​ బర్త్​డే విషెస్ తెలిపాడు. పూరిలో యానిమేటెడ్​ శాండ్​ ఆర్ట్​తో ధోనీ చిత్రం రూపొందించాడు. ప్రస్తుతం ఈ కళాకృతి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇక ధోనీని సోదరుడిగా భావించే వెస్టిండీస్​ క్రికెటర్​ బ్రావో.. 'హెలికాఫ్టర్'​ పేరుతో ఏకంగా పాటను రిలీజ్​ చేశాడు. 39వ పడిలోకి అడుగు పెట్టిన మహీకి పలువురు సినీ తారలు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.