ETV Bharat / sports

శ్రీలంక ప్రీమియర్​ లీగ్​కు సిద్ధమైన మలింగ

author img

By

Published : Oct 20, 2020, 10:25 AM IST

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​ నుంచి వ్యక్తిగత కారణాలతో వైదొలగిన శ్రీలంక పేసర్​ లసిత్​ మలింగ.. స్వదేశంలో జరగనున్న లంక ప్రీమియర్​ లీగ్​లో ఆడబోతున్నాడు. ఇతడితో పాటు డుప్లెసిస్​, రసెల్​, షాహిద్​ అఫ్రిదిలు ఈ టోర్నీలో భాగం కానున్నారు.

Lasith malinga has ready to play in lanka premier league 2020
శ్రీలంక ప్రీమియర్​ లీగ్​కు సిద్ధమైన మలింగ

వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్​కు దూరమైన పేసర్​ లసిత్​ మలింగ శ్రీలంక ప్రీమియర్​ లీగ్​లో ఆడబోతున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్​ డుప్లెసిస్​, జమైకా ఆల్​రౌండర్​ ఆండ్రీ రసెల్​, పాకిస్థాన్​ మాజీ స్టార్​ షాహిద్​ అఫ్రిది కూడా ఈ లీగ్​ బరిలో ఉన్నారు. నవంబరు 21న ఆరంభం కాబోతున్న ఈ టోర్నీలో డుప్లెసిస్, రసెల్​తో పాటు లంక ఆల్​రౌండర్​ ఏంజెలో మాథ్యూస్​ కొలంబో కింగ్స్​ తరపున బరిలో దిగనున్నారు.

ఇదే జట్టులో భారత ఆటగాళ్లు మన్విందర్​ బిస్లా, మన్​ప్రీత్​ గోనీ కూడా ఉన్నారు. గాలె గ్లాడియేటర్స్​ జట్టులో మలింగతో పాటు అఫ్రిది, ఇంగ్రామ్​ ఉండగా.. దంబుల్లా హాక్స్​లో డేవిడ్​ మిల్లర్​, కార్లోస్​ బ్రాత్​వైట్​ ఆడనున్నారు. ఈ లీగ్​లో జరిగే 23 మ్యాచ్​లకు పల్లెకలె, హంబన్​టోట వేదికలుగా నిలవనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.