ETV Bharat / sports

'ఆ స్టేడియంలో తెల్లబంతితో ఆడటం కష్టం'

author img

By

Published : Jul 25, 2020, 5:27 PM IST

ఇంగ్లాండ్​తో ఆడబోయే వన్డే సిరీస్​ వేదికలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశాడు ఐర్లాండ్​ జట్టు హెడ్​ కోచ్​ గ్రహమ్​ ఫోర్డ్​. మ్యాచ్​ జరిగే స్డేడియంలోని సీట్లు, వినియోగించే బంతి రంగు ఒకే రంగులో (తెలుపు) ఉండటం ఆటగాళ్లకు సవాల్​ లాంటిదని అభిప్రాయపడ్డాడు.

irelanf
ఇర్లాండ్​

ఈ ఏడాది జులై 30 నుంచి ఇంగ్లాండ్​తో ఆడబోయే మూడు మ్యాచుల వన్డే సిరీస్​పై ఆందోళన వ్యక్తం చేసింది ఐర్లాండ్ జట్టు​. అగియాస్​ బౌల్​ స్టేడియంలో ఈ మ్యాచులు జరగడం వల్ల ఆటగాళ్లు ఇబ్బంది పడతారని తెలిపాడు ఐర్లాండ్​ జట్టు హెడ్​ కోచ్​ గ్రహమ్​ ఫోర్డ్. ఈ మైదానంలో క్రీమ్​ రంగు సీట్లు ఉండటమే కారణమని తెలిపాడు.

మ్యాచులో తెల్లరంగు బంతితో ఆడేటప్పుడు.. సీట్ల రంగు కూడా తెల్లగా ఉండటం చేత ఫీల్డర్లకు సవాల్​గా మారుతుందని అన్నాడు. బంతి గాల్లోకి ఎగిరినప్పుడు సీట్లరంగు కాంతి దానిపై పడి కనపడటం కష్టంగా ఉంటుందని వెల్లడించాడు. కాబట్టి స్టేడియంలో మార్పులు చేయాల్సిందిగా ఇంగ్లాండ్​ బోర్డుకు విజ్ఞప్తి చేశాడు.

ఇప్పటికే తమ జట్టు ఆటగాళ్లు ఈ కారణం చేత ప్రాక్టీసు చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు ఫోర్ట్. జులై 30, ఆగస్టు 1, 4వ తేదీలలో ఐరిశ్​-ఇంగ్లీష్​ జట్ట మధ్య బయోసెక్యూర్‌ వాతావరణంలో ఈ మ్యాచులు జరగనున్నాయి.

ఇది చూడండి : ధోనీ విఫలమైతే మాత్రం కష్టమే: జోన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.