ETV Bharat / sports

ఐపీఎల్​: తొలి మ్యాచ్​ సీఎస్కే-ముంబయి మధ్యనే!

author img

By

Published : Sep 3, 2020, 5:54 PM IST

ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్​ చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్​ మధ్య పోరుతో ​ షురూ కానుంది. ఈ మెగాలీగ్​కు సంబం​ధించిన పూర్తి షెడ్యూల్​ను సెప్టెంబరు 5న బీసీసీఐ ప్రకటించనుంది. ఈ మేరకు విషయాన్ని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.

IPL
ఐపీఎల్

ఐపీఎల్​ 13వ సీజన్​ ప్రారంభ మ్యాచ్​ చెన్నై సూపర్​ కింగ్స్​, ముంబయి ఇండియన్స్​ మధ్య జరగనుంది. ధోనీ నేతృత్వంలోని సీఎస్కే, రోహిత్ నేతృత్వంలోని​ ఎమ్​ఐ తొలి మ్యాచ్​లో తలపడనున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు తెలియజేశాయి. లీగ్​కు సంబంధించిన పూర్తి షెడ్యూల్​ సెప్టెంబరు 5న బోర్డు విడుదల చేస్తుందని వెల్లడించాయి.

ఇప్పటికే సీఎస్కేలో ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మంది సిబ్బందికి కరోనా సోకడం వల్ల క్వారంటైన్​లో ఉన్నారు. లీగ్​ ప్రారంభం నాటికి వీరు పూర్తిగా కోలుకుంటారని బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎస్కే, ఎమ్​ఐ మధ్య తొలి మ్యాచ్​ నిర్వహించాలని యోచిస్తోంది.

దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఈ మెగా లీగ్​ జరగనుంది. అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికల్లో మొత్తం 53 రోజుల పాటు ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఇప్పటికే యూఏఈకి చేరుకున్న జట్లన్నీ క్వారంటైన్​ పూర్తిచేసుకుని ప్రాక్టీస్​ సెషన్​ను మొదలుపెట్టేశాయి.

ఇదీ చూడండి లంక ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్​ ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.