ETV Bharat / sports

'మొన్నటి హీరోలే.. నేటి మా శత్రువులు'

author img

By

Published : Feb 1, 2021, 5:35 AM IST

ఫిబ్రవరి 5 నుంచి జరగబోయే టెస్టు సిరీస్​లో భారత జట్టే అందరి ఫేవరేట్​గా ఉంది. అయితే ఓ ఆటగాడు మాత్రం టీమ్​ఇండియా ఆటగాళ్లు తనకు శత్రువులు అని అంటున్నాడు. రెండు వారాల క్రితం గబ్బాలో విజయం చూసి మన వాళ్లను ఆకాశానికెత్తిన ఆ ఇంగ్లాండ్​ క్రికెటర్​ ఇప్పటికి మాత్రం శత్రువులుగానే భావిస్తామని తెలిపాడు.

india had supporters within this england team throughout that decisive brisbane test stuart broad
'మొన్నటి హీరోలే.. నేటి మా శత్రువులు'

గాయాలతో ప్రధాన ఆటగాళ్లు దూరమైనా ఆస్ట్రేలియాపై టీమ్​ఇండియా అద్భుత విజయం సాధించిందని ఇంగ్లాండ్ పేసర్‌ స్టువర్ట్ బ్రాడ్ కొనియాడాడు. గబ్బా టెస్టు జరుగుతున్న సమయంలో ఆసీస్‌పై భారత్ గెలవాలని తమ జట్టు కోరుకుందని తెలిపాడు. అయితే ఇప్పుడు భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో.. రెండు వారాల క్రితం ప్రశంసించిన టీమ్​ఇండియానే, ఇప్పుడు శత్రువుగా భావించాల్సి వస్తుందని అన్నాడు. అయితే టీమ్​ఇండియాయాను అలా ఊహించుకోలేమని పేర్కొన్నాడు.

"భారత్ పర్యటన అంత తేలిక కాదు. గబ్బాలో ఆస్ట్రేలియాపై విజయంతో టీమ్​ఇండియా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే గబ్బా టెస్టులో భారత్‌కే మా జట్టు మద్దతు ఇచ్చింది. సమష్టి పోరాటం, సంకల్పం, గెలవాలనే స్ఫూర్తితో అద్భుత ప్రదర్శన చేసింది. గాయాలతో ఆటగాళ్లు దూరమైనా టీమిండియా చేసిన పోరాటాన్ని చూసి.. ప్రపంచంలో ఉన్న ఏ జట్టు అయినా ఎంతో గర్వపడుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కోహ్లీసేన ఉండటానికి కారణమిదే. అయితే రెండు వారాల క్రితం వాళ్ల ప్రదర్శనను అభిమానించిన మేం.. ఇప్పుడు టీమ్​ఇండియాను శత్రువులుగా భావించాల్సి వస్తుంది. అయితే అలా ఊహించలేం."

- స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లాండ్ పేసర్

'నేను చూసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. అయితే వాళ్ల సానుకూలతల గురించి ఆలోచిస్తే.. పోరాడక ముందే మేం ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. మా బలాలతో మేం బరిలోకి దిగుతాం. మా వద్ద టాప్‌-10 ర్యాంకింగ్స్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు. అయితే భారత్‌ పటిష్ఠంగా ఉంది. చారిత్రక విజయాలు సాధించింది. కానీ మేం సానుకూల ధోరణితో పోరాడితే తప్పక గెలుస్తాం' అని బ్రాడ్ అన్నాడు. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లు చెన్నైలో బయోబబుల్‌లో ఉన్నారు. చెపాక్‌ స్టేడియంలో ఫిబ్రవరి 5న తొలి టెస్టు జరగనుంది.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​తో రెండో టెస్టులో ప్రేక్షకులకు అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.