ETV Bharat / sports

అంపైరింగ్ సరిగా జరుగుతోందా?.. ఇంగ్లాండ్ ఆరా!

author img

By

Published : Feb 25, 2021, 12:10 PM IST

థర్డ్​ అంపైర్ నిర్ణయాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ అనంతరం రిఫరీని కలిసింది. నిర్ణయాలు తీసుకునే క్రమంలో థర్డ్ అంపైర్​ సరిగా వ్యవహరించారా లేదా అని ఆరాతీసింది.

Ind vs Eng: England ask match referee for 'consistency' in third umpire calls
అంపైర్​పై అసంతృప్తి: రిఫరీని ఆశ్రయించిన ఇంగ్లాండ్

టీమ్​ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో అంపైరింగ్పై మ్యాచ్​ రిఫరీ శ్రీనాథ్​ను ఇంగ్లాండ్ జట్టు ఆశ్రయించింది. తొలి రోజు (బుధవారం) మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయనను కలిసి అంపైర్ నిర్ణయాలపై మర్యాదపూర్వకంగా కెప్టెన్ జో రూట్, ప్రధాన కోచ్ ఆరాతీశారు. దీనిని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.

"అంపైర్లు ఎదుర్కొన్న సవాళ్లను కెప్టెన్, ప్రధాన కోచ్ అంగీకరించారు. అయితే నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో సరిగా వ్యవహరించారా? లేదా? అని రిఫరీని మర్యాదపూర్వకంగా అడిగారు. రిఫరీ కూడా అంపైర్ల గురించి వారు సరైన ప్రశ్నలు లేవనెత్తినట్లు చెప్పారు."

-ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు

గులాబి టెస్టు తొలి రోజున థర్డ్​ అంపైర్ షంషుద్దీన్ నిర్ణయాలపై పర్యాటక జట్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత ఓపెనర్లు శుభ్​మన్ గిల్, రోహిత్ శర్శలను ఆన్​ఫీల్డ్ అంపైర్లు ఔట్​గా ప్రకటించగా.. అప్పీలుపై వారిని నాటౌట్​గా తేల్చారు టీవీ అంపైర్.

రెండో ఓవర్​లో గిల్​ క్యాచ్​పై బెన్​ స్టోక్స్​ అప్పీల్ చేశాడు. దానిని పరిశీలించిన మీదట థర్డ్ అంపైర్ నాటౌట్​గా ప్రకటించాడు. కానీ కొన్ని కోణాల్లో అది ఔట్​గా అనిపించినట్లు ఇంగ్లాండ్ జట్టు అసహనం వ్యక్తం చేసింది. రోహిత్ స్టంపింగ్​ విషయంలో కూడా ఇదే జరిగిందని వారు వాపోయారు . దీంతో ఆన్​ఫీల్డ్ అంపైర్​ నితిన్ మేనన్​తో 'మాకు స్థిరత్వం కావాలి' అని రూట్ అన్నాడు.

అంతకుముందు ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలే కూడా అంపైర్ల నిర్ణయంపై అసహనం వ్యక్తంచేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 99/3 పరుగుల వద్ద నిలిచింది. తొలుత బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్ 112 పరుగులకే కుప్పకూలింది.​

ఇదీ చూడండి: బంతికి ఉమ్ము రుద్దిన స్టోక్స్- శానిటైజ్​ చేసిన అంపైర్లు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.