ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​: లంకపై రాధా ప్రతాపం.. భారత్​ లక్ష్యం 114

author img

By

Published : Feb 29, 2020, 11:24 AM IST

Updated : Mar 2, 2020, 10:51 PM IST

మెల్​బోర్న్​ వేదికగా భారత్​తో జరుగుతున్న గ్రూప్​ మ్యాచ్​లో తక్కువ పరుగులకే పరిమితమైంది శ్రీలంక మహిళా జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 రన్స్​ చేసింది. లంక జట్టులో కెప్టెన్​ చమర్తి, కవిష రాణించారు. భారత బౌలింగ్​లో రాధా యాదవ్​ 4 వికెట్లు తీసుకుంది.

India Women vs Sri Lanka Women
టీ20 ప్రపంచకప్​: మహిళా టీమిండియా లక్ష్యం 114

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్​తో జరుగుతున్న గ్రూప్​ మ్యాచ్​లో.. నామమాత్రపు స్కోరు చేసింది శ్రీలంక. కెప్టెన్​ చమర్తి ప్రదర్శనతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేసింది లంక జట్టు.

చెలరేగిన రాధా...

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న శ్రీలంక మహిళా జట్టుకు.. మంచి ఆరంభం లభించలేదు. ఉమేశ(2) త్వరగానే ఔటవ్వగా.. కెప్టెన్​ చమర్తి(33), హర్షిత(12) నెమ్మదిగా ఇన్నింగ్స్​ నడిపించారు. ఈ నేపథ్యంలో కెరీర్​లో 500 టీ20 రన్స్​ పూర్తిచేసుకుంది చమర్తి. అయితే ఈ జోడీని 7 పరుగుల వ్యవధిలో ఔట్​ చేసి భారీ స్కోరుకు అడ్డుకట్ట వేశారు భారత బౌలర్లు.

ఆఖర్లో కవిష (25) వేగంగా పరుగులు రాబట్టింది. టీమిండియా బౌలింగ్​ విభాగంలో రాధా యాదవ్​ ఆడిన రెండో మ్యాచ్​లోనూ అదరగొట్టింది. 23 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసింది. ఇది ఆమె కెరీర్​లోనే అత్యుత్తమం కావడం విశేషం. ఈమెకు తోడు రాజేశ్వరి(2/18), దీప్తి, శిఖా, పూనమ్​ తలో వికెట్​ తీసుకొని ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు.

Last Updated : Mar 2, 2020, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.