ETV Bharat / sports

స్మిత్​కు కోచ్​ అక్కర్లేదు: లాంగర్

author img

By

Published : Jan 5, 2021, 8:58 PM IST

ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ స్టీవ్​ స్మిత్​ తిరిగి ఫామ్​లోకి వస్తాడని అన్నాడు ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్. జనవరి 7న భారత్​, ఆసీస్ మధ్య మూడో టెస్టు జరగనున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.

Aussies coach Langer words on Smith
స్మిత్​కు కోచ్​ అక్కర్లేదు: లాంగర్

భారత్​తో జరగనున్న మూడో టెస్ట్​లో ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్ స్టీవ్ స్మిత్ తిరిగి ఫామ్​లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్. భారత్​తో పరిమిత ఓవర్ల టోర్నీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినా..​ సుదీర్ఘ ఫార్మాట్​లో స్మిత్ రాణించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్​ బ్యాట్స్​మన్​ను వెనకేసుకొచ్చాడు లాంగర్.

"ఈ సిరీస్​లో స్మిత్ ఇప్పటివరకు​ ఉత్తమ బ్యాటింగ్​ ప్రదర్శన చేయలేదు. ఒకవేళ స్మిత్​ ఆడితే ఆసీస్​ టీమ్​ ఎంత దృఢంగా ఉంటుందో ఊహించండి. గొప్ప ఆటగాళ్లు ఫామ్​ తప్పడం సహజమే.. కానీ, వాళ్లు మళ్లీ ఫామ్​లోకి రావడానికీ ఎక్కువ సమయం పట్టదు. నేను స్మిత్​కు ప్రత్యేకంగా కోచింగ్​ ఇవ్వాల్సిన పనిలేదు. తనకు తానే కోచింగ్​​ చేసుకుంటాడు. తను తప్పకుండా ఫామ్​లోకి వస్తాడు"

-జస్టిన్ లాంగర్, ఆసీస్ కోచ్.

తాను జట్టు కోచ్​గా వ్యవహరించే పరిమిత సమయంలోనే స్మిత్​ మెరుపు ఇన్నింగ్స్ చూడాలని ఆశాభావం వ్యక్తం చేశాడు జస్టిన్ లాంగర్. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు జనవరి 7న సిడ్నీ వేదికగా జరగనుంది.

ఇదీ చదవండి:సిడ్నీ టెస్టు: రికార్డులపై కన్నేసిన రహానె

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.