ETV Bharat / sports

'పంత్.. ప్రత్యర్థికి గుండెపోటు తెప్పించగలడు'

author img

By

Published : Feb 2, 2021, 11:10 AM IST

'Great package' Rishabh Pant can give heart attacks, Says R Sridhar
క్రికెటర్​గా పంత్​ ఓ ప్యాకేజీ: ఫీల్డింగ్​ కోచ్​

యువ క్రికెటర్​ రిషబ్​ పంత్​ బ్యాటింగ్​పై టీమ్​ఇండియా ఫీల్డింగ్​ కోచ్​ ఆర్​. శ్రీధర్​ ప్రశంసలు కురిపించాడు. అటు బ్యాటింగ్​తో పాటు వికెట్​ కీపింగ్​పైనా పంత్​ దృష్టి సారించాడని తెలిపాడు. పంత్​ తన బ్యాటింగ్​ ప్రదర్శనతో ప్రత్యర్థికి గుండెపోటు తెప్పించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.

టీమ్​ఇండియా యువ క్రికెటర్​ రిషబ్​ పంత్​పై జట్టు ఫీల్డింగ్​ కోచ్​ ఆర్​. శ్రీధర్​ ప్రశంసలు కురిపించాడు. పంత్​.. బ్యాటింగ్​తో పాటు వికెట్​ కీపింగ్​పైనా దృష్టి సారించాడని తెలిపాడు. ఇంగ్లాండ్​ పర్యటన కోసం పంత్​ తగిన సమయాన్ని వెచ్చిస్తూ శిక్షణ పొందుతున్నాడని.. అతడి బ్యాటింగ్​తో ప్రత్యర్థికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.

"ఈ పర్యటనలో వికెట్​ కీపింగ్​లో పట్టు సాధించేందుకు రిషబ్​ పంత్​ తన బ్యాటింగ్​ ప్రాక్టీసును త్యాగం చేసి గంట లేదా గంటన్నర పాటు శ్రమించిన సందర్భాలున్నాయి. పంత్​ గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇది మంచి వార్త. ప్రస్తుతం అతడు మరింత మెరుగువుతున్నాడు. అతడి ప్రదర్శనతో ప్రత్యర్థికి గుండెపోటును తెప్పించగలడు. తన ప్రదర్శనతో మీకు ఊపిరాగిపోయేంత పని అవ్వొచ్చు. క్రికెటర్​గా పంత్​ ఓ గొప్ప ప్యాకేజీ. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో భయంలేని క్రికెటర్​గా పంత్​ నిలుస్తాడు. అలాగే అతడు లెఫ్ట్​హ్యాండెడ్​ బ్యాట్స్​మన్​.. దీనివల్ల మిడిల్​ ఆర్డర్​లో మార్పు కనిపిస్తుంది".

- ఆర్​.శ్రీధర్​, టీమ్ఇండియా ఫీల్డింగ్​ కోచ్​

ఆస్ట్రేలియా పర్యటనలో యువ బ్యాట్స్​మన్​ పంత్​ బ్యాటింగ్​లో రాణించాడు. ఆడిన మూడు టెస్టుల్లో రెండు అర్ధశతకాలను నమోదు చేసి.. మొత్తంగా 274 పరుగులు రాబట్టాడు. సిడ్నీ టెస్టులో కీలక విజయానికి ప్రధాన కారణమయ్యాడు. దీంతో ఆసీస్​తో జరిగిన టెస్టు సిరీస్​లో 2-1 తేడాతో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది.

ఇంగ్లాండ్​, టీమ్ఇండియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్​ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: ఇషాంత్ లేకుండా గంభీర్ జట్టు.. బుమ్రాకు రెస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.