ETV Bharat / sports

సచిన్​, కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఇర్ఫాన్​ పఠాన్​

author img

By

Published : Jan 7, 2020, 4:46 PM IST

Updated : Jan 7, 2020, 5:36 PM IST

అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్(ఐసీసీ)​ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనకు మద్దతిచ్చాడు భారత మాజీ క్రికెటర్​ ఇర్ఫాన్​ పఠాన్​. రంజీల్లో ఇదే తరహాలో మ్యాచ్​లు జరుగుతున్నా, అంతర్జాతీయ క్రికెట్లోనే ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతుందని ప్రశ్నించాడు. కొన్ని రోజులు ఈ విధానాన్ని పరిశీలించి చూడాలని అభిప్రాయపడ్డాడు.

Former Indian Cricketer Irfan Pathan Disagrees With Virat Kohli, Sachin Tendulkar Note on 4-Day Tests
సచిన్​, కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఇర్ఫాన్​ పఠాన్​

నాలుగు రోజుల టెస్టు ఆలోచనపై టీమిండియా మాజీ క్రికెటర్లు మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్​, గౌతమ్​ గంభీర్​ సహా ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్​మన్​ విరాట్​ కోహ్లీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో... ఈ ప్రతిపాదనకు మద్దతిచ్చాడు భారత మాజీ క్రికెటర్​ ఇర్ఫాన్​ పఠాన్​. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్​ (ఐసీసీ) నిర్ణయం సరైనదే అని అభిప్రాయపడ్డాడు. దేశవాళీల్లోని సుదీర్ఘ ఫార్మట్​ మ్యాచ్​లు నాలుగు రోజులే ఆడుతున్నారని... అందులో ఫలితాలు వస్తున్నాయి కదా అని అన్నాడు.

" సుదీర్ఘ ఫార్మాట్​ భవిష్యత్తు కోసం నాలుగు రోజుల టెస్టుకు మద్దతు పలకాలి. ఈ తరహా మ్యాచ్​లు రంజీల్లో ఇప్పటికే ఆడుతున్నారు. ఫలితాలూ వస్తున్నాయి. అంతర్జాతీయ టెస్టు క్రికెట్​లోకి ఈ విధానం తీసుకొస్తే ఫలితాలు వస్తాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా రెండేళ్ల తర్వాత అయినా వీటిని రెగ్యులర్​గా ప్రవేశపెడితే బాగుంటుంది".
--ఇర్ఫాన్​ పఠాన్​, భారత మాజీ క్రికెటర్​

ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ బోర్డులు ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నాయి. భారత మాజీ క్రికెటర్లు సహా విదేశీ మాజీలు మెక్​గ్రాత్​, రికీ పాంటింగ్​ వంటి ఆటగాళ్లు నాలుగు రోజుల టెస్టును వ్యతిరేకిస్తున్నారు. సంప్రదాయ టెస్టు క్రికెట్​ను కొత్త తరాన్ని ఆకర్షించేందుకు, మార్చాల్సిన అవసరం లేదని సచిన్​​ అభిప్రయపడ్డాడు.

కుంబ్లే నేతృత్వంలో కమిటీ

4 రోజుల టెస్టు అంశం గురించి చర్చించేందుకు అనిల్ కుంబ్లే నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది ఐసీసీ. దుబాయ్ వేదికగా మార్చి 27 నుంచి 31 వరకు జరగనున్న ఈ సమావేశంలో.. ఈ ప్రతిపాదనపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కమిటీలో కుంబ్లేతోపాటు ఆండ్రూ స్ట్రాస్, రాహుల్ ద్రవిడ్, మహేలా జయవర్ధనే, షాన్ పొలాక్ సభ్యులుగా ఉన్నారు. 2023-31 మధ్య కొత్త భవిష్యత్‌ పర్యటనల ప్రణాళికలో... పూర్తిగా నాలుగు రోజుల టెస్టులే ఆడించాలని ఐసీసీ భావిస్తోంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Tokyo – 7 January 2020
1. Close of statement from Tokyo prosecutor's office saying that the arrest warrant was issued for Carole Ghosn for perjury
2. Close pan of the sentence reading the warrant was issued for Carole Ghosn
3. Tilt down from reporters working at AP Tokyo office to the statement
4. Close pan of the sentences explaining how she allegedly gave false testimony
5. Tilt down of the statement
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Tokyo - 6 March 2019
6. STILL of Carole Ghosn walking to car waiting at entrance of Tokyo Detention Center, where her husband is detained
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Tokyo - Unknown day March 2019
7. STILL of Former Nissan Chairman Carlos Ghosn and his wife Carole in Tokyo
STORYLINE:
Tokyo prosecutors obtained an arrest warrant Tuesday for the wife of Nissan's former chairman, Carlos Ghosn, on suspicion of perjury, adding to the couple's legal troubles in the country where he once was revered as a star executive.
The move against Carole Ghosn, who is not in Japan, followed her husband's flight to Lebanon last week while he was out on bail awaiting trial for alleged financial misconduct.
Prosecutors said in a statement that Carole Ghosn gave false testimony to a Tokyo court last year in her husband's case about the transfer of money from one company to another that allegedly caused losses to Nissan.
She also denied knowing various people, or meeting with them, and the statements were false, they said. The allegations cited were unrelated to Ghosn's escape.
Carole Ghosn was not immediately available for comment but earlier she told The Associated Press after her questioning in court that she considered the questions trite and unsubstantial.
She was banned from meeting with her husband after his release on bail because of fears she might help tamper with evidence.
Lebanon and Japan do not have an extradition treaty.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 7, 2020, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.