ETV Bharat / sports

ఈసీబీపై కరోనా ప్రభావం.. ఉద్యోగాల్లో కొత

author img

By

Published : Sep 15, 2020, 10:37 PM IST

Updated : Sep 16, 2020, 6:17 AM IST

England cricket Board
ఈసీబీ

ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డుపై కరోనా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు సీఈఓ టామ్​ హారిసన్​ తెలిపారు.

ఇంగ్లాండ్​ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఉద్యోగాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బోర్డులో పని చేస్తున్న 20 శాతం(62 మందికి సమానం) ఉద్యోగులను తీసేస్తున్నట్లు సీఈఓ టామ్​ హారిసన్​ తెలిపారు. కరోనా కారణంగా ఆర్థిక ప్రభావం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

"బోర్డుపై ఆర్థిక ప్రభావం పడుతున్నందున ఇటీవలి వారాల్లో అనేక చర్చల అనంతరం కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చాం. వీటిని సహోద్యోగులతో పంచుకున్నాం. ఇందులో బాగంగా కొంత మందిని ఉద్యోగాల నుంచి తీసేయాలని నిర్ణయించాం. తద్వారా బోర్డుపై ప్రభావం తగ్గుతుంది."

-టామ్​ హారిసన్​, ఈసీబీ సీఈఓ

ఈ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి భవిష్యత్తులో సాయం చేసేలా ఈసీబీ ఆలోచిస్తోందని హారిసన్​ పేర్కొన్నారు. ఈ విషయంపై త్వరలోనే సమాచారాన్ని తెలియచేస్తామని స్పష్టం చేశారు.

Last Updated :Sep 16, 2020, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.