ETV Bharat / sports

డివిలియర్స్ జట్టులోకి వస్తే బాగుండు: డుప్లెసిస్​

author img

By

Published : Dec 17, 2019, 10:11 AM IST

ఏబీ డివిలియర్స్​ తిరిగి జట్టులోకి రప్పించాలని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్​ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది ఆసీస్​ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​కు అతడు జట్టులోకి వస్తే చూడాలనుందని తెలిపాడు.

Du Plessis wants De Villiers back
డివిలియర్స్

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తిరిగి జట్టులోకి రప్పించాలని ఆ దేశ సీనియర్లు భావిస్తున్నారు. ఇటీవల కోచ్​గా నియమితుడైన మార్క్ బౌచర్.. ఏబీని రప్పిస్తానని చెప్పగా.. తాజాగా సఫారీల సారథి ఫాఫ్ డుప్లెసిస్ ఇదే విధంగా స్పందించాడు. 2020 టీ20 ప్రపంచకప్​లో డివిలయర్స్​ పునరాగమనం చేస్తే చూడాలనుందని చెప్పాడు.

"రెండు మూడు నెలల క్రితమే ఈ అంశంపై(డివిలియర్స్ పునరాగమనం) చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​పైనే దృష్టిసారించాం. అయితే టీ20 ఫార్మాట్​ విభిన్నంగా ఉంటుంది." - ఫాఫ్ డుప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్

2018లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​తో అంతర్జాతీయ టెస్టులకు వీడ్కొలు పలికాడు. అంతకు కొద్ది రోజుల ముందు భారత్​తో కెరీర్​లో చివరి వన్డేసిరీస్ ఆడాడు డివిలియర్స్​. 2017లో బంగ్లాతో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు డివిలియర్స్.

ఇటీవలే దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్​ గ్రేమ్ స్మిత్ ఆ జట్టు ఇంటిరిమ్ డైరెక్టర్​గా బాధ్యతలు తీసుకున్నాడు. మాజీ ఆటగాడు మార్క్ బౌచర్​ నూతన్ కోచ్​ నియమితులయ్యాడు. ఈ నేపథ్యంలో జట్టుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి: 'పౌర' నిరసనల నడుమ యథావిధిగా ఐపీఎల్ వేలం

SNTV Daily Planning Update, 0030 GMT
Tuesday 17th December 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Artist defends choice of ape paintings for Serie A anti-racism campaign. Already moved.
SOCCER: Porto keep pressure on Benfica with 3-0 win over Tondela in Primeira Liga. Already moved.
ICE HOCKEY (NHL): Columbus Blue Jackets v. Washington Capitals. Expect at 0400.
ICE HOCKEY (NHL): St. Louis Blues v. Colorado Avalanche. Expect at 0500.
BASKETBALL (NBA): Houston Rockets v. San Antonio Spurs. Expect at 0500.
BASKETBALL (NBA): Phoenix Suns v. Portland Trail Blazers. Expect at 0530.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.