ETV Bharat / sports

కొత్త లుక్​తో కేక పుట్టిస్తోన్న ధోనీ

author img

By

Published : Jun 28, 2020, 9:45 AM IST

Updated : Jun 28, 2020, 1:23 PM IST

Dhoni
ధోనీ

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ కొత్త లుక్​లో అలరిస్తున్నాడు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీ ఎప్పటికప్పుడు కొత్తలుక్స్​లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు. లాక్​డౌన్​తో ప్రస్తుతం ఇంటికే పరిమితమైన మహీ.. తాజాగా మరో లుక్​లో కనిపించి అలరిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం వైరల్​గా మారింది. ఇందులో షేప్​ చేసిన నల్లటిరంగు గడ్డంతో స్టైలిష్​గా కనిపిస్తున్నాడు ధోనీ. హెయిర్​స్టైల్​ కూడా ఇంతకు ముందు కంటే భిన్నంగా ఉంది.

dhoni
ధోనీ కొత్త లుక్​

గతేడాది జరిగిన ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్​ ధోనీ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్​. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఐపీఎల్​ 13వ సీజనలో పాల్గొని తిరిగి జట్టులో చోటు దక్కించుకోవాలనుకున్నాడు. కానీ కరోనా ప్రభావంతో ఈ టోర్నీ నిరవధిక వాయిదా పడింది. అయితే దీనిని సెప్టెంబరు-నవంబరు మధ్య కాలంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

ఇది చూడండి : 'ఇంగ్లాండ్​కు ఆడితే చంపేస్తామన్నారు'

Last Updated :Jun 28, 2020, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.