ETV Bharat / sports

'అనుకున్న సమయానికే టీ20 ప్రపంచకప్​ జరుగుతుంది'

author img

By

Published : Mar 17, 2020, 3:49 PM IST

ఈ ఏడాది జరగాల్సిన పురుషుల టీ20 ప్రపంచకప్​ను యథావిధిగా నిర్వహిస్తామని క్రికెట్​ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కెవిన్​ రాబర్ట్స్​ వెల్లడించారు. మరికొద్ది రోజుల్లోనే సాధారణ వాతావరణం నెలకొని క్రీడాటోర్నీలు తిరిగి ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Cricket Australia planning to host T20 World Cup as per schedule
'అనుకున్న సమయానికే టీ20 ప్రపంచకప్​ జరుగుతుంది'

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడాటోర్నీలను వాయిదా వేయగా.. మరికొన్ని రద్దయ్యాయి. దీనితో సంబంధం లేకుండా పురుషుల టీ20 ప్రపంచకప్​ను యథావిధిగా నిర్వహించాలని క్రికెట్​ ఆస్ట్రేలియా భావిస్తోంది. దీనిపై ఆ బోర్డు అధ్యక్షుడు కెవిన్​ రాబర్ట్స్​ స్పందించారు.

"కొద్ది రోజుల్లోనే తిరిగి మళ్లీ క్రీడా టోర్నీలు ప్రారంభమవుతాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ, ఈ ఏడాది పురుషుల టీ20 ప్రపంచకప్​ జరిగే అక్టోబర్-నవంబర్ సమయానికి సాధారణ వాతావరణం నెలకొంటుందని భావిస్తున్నాం. నవంబర్ 15న మెల్​బోర్న్​ క్రికెట్​ స్టేడియంలో ఫైనల్​ నిర్వహిస్తాం. ఆ మ్యాచ్​కు స్టేడియం మొత్తం నిండిపోయి.. మహిళల టీ20 కంటే గొప్ప స్పందన వస్తుందని ఆశిస్తున్నాం ."

- కెవిన్​ రాబర్ట్స్​, క్రికెట్​ ఆస్ట్రేలియా అధ్యక్షుడు

పురుషుల టీ20 ప్రపంచకప్​నకు అర్హత పోటీ​లు​ అక్టోబర్ 18 నుంచి 23 వరకు జరగనున్నాయి. అక్టోబర్ 24 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది.. అందులో 12 జట్లు పాల్గొననున్నాయి. ఫైనల్​ మ్యాచ్ నవంబరు 15న మెల్​బోర్న్​ క్రికెట్​ స్టేడియంలో జరగనుంది.

​ఇదీ చూడండి.. 'గంగూలీ స్కూల్​కు చెందినవాడు కోహ్లీ.. అందుకే అలా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.