ETV Bharat / sports

లీగ్​లో ఆడుతున్న క్రికెటర్లకు హెయిర్​ కట్ కష్టమే!

author img

By

Published : Dec 24, 2020, 2:41 PM IST

కరోనా కట్టడిలో భాగంగా బిగ్​బాష్​ లీగ్​లో నిబంధనలను కఠినతరం చేశారు. హెయిర్​ కట్​ లాంటి వ్యక్తిగత అవసరాల కోసం ఆటగాళ్లెవరూ బయోబబుల్​ను దాటి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది.

COVID-19 Impact: CA bans haircuts of Big Bash players
'హెయిర్​ కట్​ కోసం వెళ్లడానికి వీల్లేదు'

బిగ్​బాష్​ లీగ్​లోని ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా క్రికెట్​ ఆస్ట్రేలియా(సీఏ) కట్టుదిట్టమైన నిబంధనలు ప్రవేశపెట్టింది. హెయిర్​ కట్​ కోసం ఆటగాళ్లు బయోబబుల్​ను దాటి బయటకు వెళ్లకుండా నిషేధం విధించింది. సిడ్నీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ తరహా ఆంక్షలు విధించింది.

క్వీన్స్​లాండ్​లో​ బిగ్​బాష్​ నిబంధనల ప్రకారం.. హెయిర్​ కట్​ లాంటి వ్యక్తిగత పనులు కోసం బయటకు వెళ్లేందుకు ఆటగాళ్లకు అనుమతి లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అవసరాల కోసం ఇతరులను లోపలకు అనుమతి ఇస్తే మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. బయట నుంచి వచ్చే ఆహార పదార్థాలపై ఆంక్షలు విధించింది ఆసీస్ బోర్డు.

ఇదీ చూడండి:'బిగ్​బాష్ లీగ్​​ కొత్త నిబంధనలు ఓ జిమ్మిక్కు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.