ETV Bharat / sports

'కోహ్లీసేనను చూసి ఆసీస్ క్రికెటర్లు భయపడుతున్నారు'

author img

By

Published : Apr 7, 2020, 1:14 PM IST

ఐపీఎల్ కాంట్రాక్ట్​లు కాపాడుకునేందుకు ఆసీస్ క్రికెటర్లు, కోహ్లీసేనను స్లెడ్జ్​ చేసేందుకు భయపడుతున్నారని చెప్పాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్.

'కోహ్లీసేనను చూసి ఆసీస్ క్రికెటర్లు భయపడుతున్నారు'
కోహ్లీతో ఆసీస్ క్రికెటర్లు

కోహ్లీసేనను స్లెడ్జ్​ చేసేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ భయపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్. తమ ఐపీఎల్ కాంట్రాక్ట్​లు కాపాడుకునేందుకు వారు ఇలా చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాల్ని చెప్పాడు.

former skipper Michael Clarke
ఆసీస్ మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్

"క్రికెట్​లో ఆర్థికంగా భారత్ ఎంత శక్తిమంతమైనదో అందరికీ తెలుసు. అందుకే ఆస్ట్రేలియాతో పాటు మిగిలిన జట్లు కొంతకాలం నుంచి టీమిండియాను చూసి భయపడుతున్నాయి. కోహ్లీతో పాటు మిగతా క్రికెటర్లను స్లెడ్జ్​ చేసేందుకు వెనకాడుతున్నాయి. ఏప్రిల్​లో భారత్​ ఆటగాళ్లతో కలిసి ఆడాలని వారికి తెలుసు. కోహ్లీ సారథ్యం వహిస్తున్న బెంగళూరు జట్టు వారిని తీసుకుంటే, ఆరు వారాల్లో మిలియన్ డాలర్లు సంపాదించొచ్చని చాలా మంది అనుకుంటున్నారు. అందుకే మైదానంలో కోహ్లీసేనతో దురుసుగా ప్రవర్తించడం లేదు" -మైకేల్ క్లార్క్, ఆసీస్ మాజీ క్రికెటర్

ఐపీఎల్ 13వ సీజన్​.. కరోనా ప్రభావంతో ఈనెల 15కు వాయిదా పడింది. అయితే వైరస్​ వ్యాప్తి ఎక్కువవతుండటం వల్ల ఈ టోర్నీ జరుగుతుందా? లేదా? సందేహాలు వస్తున్నాయి.

ind vs aus match photo
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్​లోని దృశ్యం

ఈ సీజన్​ కోసం ఆసీస్ ఆలౌరౌండర్​ పాట్ కమిన్స్​ను కోల్​కతా నైట్​రైడర్స్... రూ.15.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఐపీఎల్ ఇప్పటివరకు అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్ ఇతడే. వీరితో పాటే మ్యాక్స్​వెల్​ను రూ.10.75 కోట్లు(కింగ్స్ ఎలెవన్ పంజాబ్), కౌల్టర్​నైల్​ను రూ.8 కోట్లు(ముంబయి ఇండియన్స్) కొనుగోలు చేశారు.​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.