ETV Bharat / sports

అందమైన భామలు.. 'బ్యాట్​' మెరుపు తీగలు

author img

By

Published : Mar 5, 2020, 7:32 AM IST

Updated : Mar 5, 2020, 7:57 AM IST

ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్​ జరుగుతోంది. ఆటతోనే కాకుండా అందంతోనూ ఆకట్టుకుంటున్నారు మహిళా క్రికెటర్లు. ఆ ముద్దుగుమ్మలు ఎవరో తెలుసుకుందామా..

Beautiful-womens-cricketers-in-ICC-Womens-T20-World-Cup-2020
అందమైన భామలు.. 'బ్యాట్​' మెరుపు తీగలు

ఫోర్లు, సిక్సర్లు, వికెట్లు, కవ్వింపులు, అద్భుత విన్యాసాలు, హోరాహోరీ పోరులు, భావోద్వేగాలు.. క్రికెట్ అంటే ఎవరి మదిలోనైనా మెదిలేది ఇదే. అయితే ఇప్పుడు క్రికెట్‌కు మరో కొత్త ఆకర్షణ వచ్చి చేరింది. దానికి కారణం మహిళా క్రికెటర్లే. వారు మైదానంలో శివంగుల్లా పోరాడుతూ.. తమ అందంతో కుర్రకారు మనసు దోచేసుకుంటున్నారు. ఫలితంగా మహిళా క్రికెట్‌ ఆటతో పాటూ గ్లామర్‌గా మారిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆటతో పాటు అందంతో మెరుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న వారిపై మీరూ ఓ లుక్కేయండి

ఎలిస్‌ పెర్రీ

ఆస్ట్రేలియా జట్టులో ఎలిస్‌ పెర్రీ ఎంతో కీలకప్లేయర్‌. ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో ఈ పేసర్ ఎప్పుడూ ముందుంటుంది. ఆసీస్ తరఫున 8 టెస్టులు, 112 వన్డేలు, 120 టీ20లు ఆడింది. టెస్టుల్లో 31, వన్డేల్లో 152, టీ20ల్లో 114 వికెట్లు పడగొట్టింది.

Beautiful-womens-cricketers-in-ICC-Womens-T20-World-Cup-2020
ఎలిస్‌ పెర్రీ
Beautiful-womens-cricketers-in-ICC-Womens-T20-World-Cup-2020
ఎలిస్‌ పెర్రీ

స్మృతి మంధాన

భారత ఓపెనర్‌ స్మృతి మంధాన దూకుడుగా బ్యాటింగ్‌ చేయడంలో ఆరితేరిన ప్లేయర్‌. మైదానంలో ప్రదర్శనకే కాదు, తన నవ్వుకు కూడా ఎంతో మంది అభిమానులు ఫిధా అయ్యారు. టీమిండియా తరఫున 2 టెస్టులు, 51 వన్డేలు, 74 టీ20లు ఆడింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో 81, వన్డేల్లో 2,025, టీ20ల్లో 1,705 పరుగులు చేసింది.

Beautiful-womens-cricketers-in-ICC-Womens-T20-World-Cup-2020
స్మృతి మంధాన

డానీ వ్యాట్‌

డానీ వ్యాట్.. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్. ఆ దేశం తరఫున 74 వన్డేలు, 109 టీ20లు ఆడింది. వన్డేల్లో 1,028 పరుగులతో పాటు 27 వికెట్లు, టీ20ల్లో 1,588 పరుగులతో పాటు 46 వికెట్లు తీసింది.

Beautiful-womens-cricketers-in-ICC-Womens-T20-World-Cup-2020
డానీ వ్యాట్‌

మెగ్‌ లానింగ్‌

ఆస్ట్రేలియా సారథి మెగ్‌ లానింగ్‌ బ్యాట్​తో రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆసీస్ తరఫున 4 టెస్టులు, 80 వన్డేలు, 102 టెస్టులు ఆడింది. టెస్టుల్లో 185, వన్డేల్లో 3,693, టీ20ల్లో 2,723 పరుగులు సాధించింది.

Beautiful-womens-cricketers-in-ICC-Womens-T20-World-Cup-2020
మెగ్‌ లానింగ్‌

అమేలియా కెర్‌

అమేలియా కెర్ న్యూజిలాండ్‌ పేసర్‌‌. కివీస్‌ తరఫున 32 వన్డేలు, 32 టీ20లు ఆడింది. వన్డేల్లో 48 వికెట్లు, టీ20ల్లో 34 వికెట్లు పడగొట్టింది. అప్పుడప్పుడు ఆమె బ్యాటుతోనూ మెరుస్తుంటుంది.

Beautiful-womens-cricketers-in-ICC-Womens-T20-World-Cup-2020
అమేలియా కెర్‌

నటాలీ స్కీవర్‌

ఆల్‌రౌండర్‌ నటాలీ స్కీవర్.. ఇంగ్లాండ్‌ జట్టులో కీలక ప్లేయర్‌. ఆ దేశం తరఫున 5 టెస్టులు, 67 వన్డేలు, 75 టీ20లు ఆడింది. టెస్టుల్లో 228 పరుగులతో పాటు 2 వికెట్లు, వన్డేల్లో 1,885 పరుగులు, 44 వికెట్లు, టీ20ల్లో 1,425 పరుగులు, 58 వికెట్లు సాధించింది.

Beautiful-womens-cricketers-in-ICC-Womens-T20-World-Cup-2020
నటాలీ సీవర్‌

డేన్ వాన్‌ నికెర్క్

దక్షిణాఫ్రికా సారథి డేన్‌ వాన్‌ నికెర్క్‌ ఆల్‌రౌండర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఒక టెస్టు, 102 వన్డేలు, 82 టీ20లు ఆడింది. వన్డేల్లో 2,115 పరుగులు, 130 వికెట్లు.. టీ20ల్లో 1,827 పరుగులు, 63 వికెట్లు తీసింది.

Beautiful-womens-cricketers-in-ICC-Womens-T20-World-Cup-2020
డేన్ వాన్‌ నికెర్క్

జవేరియా ఖాన్‌

జవేరియా ఖాన్‌ పాక్‌ జట్టులో కీలక బ్యాటర్‌. ఇప్పటివరకు 103 వన్డేలు, 101 టీ20లు ఆడింది. వన్డేల్లో 2,639 పరుగులు, టీ20ల్లో 1,826 పరుగులు చేసింది.

Beautiful-womens-cricketers-in-ICC-Womens-T20-World-Cup-2020
జవేరియా ఖాన్‌

బిస్మా మరూఫ్

పాక్‌ సారథి బిస్మా మరూఫ్ 108 వన్డేలు, 108 టీ20లు ఆడింది. వన్డేల్లో 2,602 పరుగులతో పాటు 44 వికెట్లు, టీ20ల్లో 2,225 పరుగులు, 36 వికెట్లు తీసింది.

Beautiful-womens-cricketers-in-ICC-Womens-T20-World-Cup-2020
బిస్మా మరూఫ్

ఇదీ చూడండి.. అదే నన్ను గొప్ప ఆటగాడిగా మార్చింది: ధోని

Last Updated : Mar 5, 2020, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.