ETV Bharat / sports

'భారత్​ క్రికెట్​ స్థాయిని పెంచే సత్తా వారిద్దరి​ సొంతం'

author img

By

Published : Jan 2, 2020, 6:31 AM IST

BCCI president Sourav Ganguly and India A coach Rahul Dravid will take Indian cricket to unprecedented heights: Rahane
'భారత్ క్రికెట్​ను టాప్​లో ఉంచే సత్తా వారిద్దరి​ సొంతం'

ఫిబ్రవరిలో న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​ ఆడనుంది టీమిండియా. ఇందులో గెలిచి టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కొనసాగించాలని భారత్​ భావిస్తోంది. తాజాగా కివీస్​ పర్యటనపై టెస్టు జట్టు ఉపసారథి అజింక్య రహానే పలు విషయాలు వెల్లడించాడు.

2019లో టెస్టుల్లో ఎదురులేని జట్టుగా దూసుకెళ్లిన కోహ్లీ సేన... టెస్టు ఛాంపియన్​షిప్​లో అగ్రస్థానంలో నిలిచింది. 2020లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్​తో మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్​ మ్యాచ్​లను అడనుంది. న్యూజిలాండ్‌లో మ్యాచ్​లు సహా భారత క్రికెట్​లో గంగూలీ, ద్రవిడ్​ పాత్రలపై మాట్లాడాడు టీమిండియా టెస్టు జట్టు ఉప సారథి అజింక్య రహానే.

చల్లని గాలులే కీలకం...

న్యూజిలాండ్​లో చల్లని గాలులకు తట్టుకోవడమే కీలకమని అజింక్య రహానె అన్నాడు. సాంకేతికంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరమేమీ ఉండదన్నాడు.

BCCI president Sourav Ganguly and India A coach Rahul Dravid will take Indian cricket to unprecedented heights: Rahane
కెప్టెన్​ కోహ్లీతో వైస్​కెప్టెన్​ రహానే

"2014లో మేం న్యూజిలాండ్​లో పర్యటించాం. చల్లగాలి సమస్య ఎదుర్కొన్నాం. పరిస్థితులకు అలవాటు పడటమే కీలకం. చల్లదనంతో బంతులు రెండు వైపులా స్వింగవుతాయి. చివరి పర్యటనలో నేను వెల్లింగ్టన్‌లో ఆడాను. క్రైస్ట్‌చర్చ్‌లో ఆడలేదు. చాన్నాళ్ల తర్వాత అక్కడ ఆడబోతున్నాం. కివీస్‌ బౌలర్‌ నీల్‌ వాగ్నర్‌ ఈ మధ్య కాలంలో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అతనొక్కడే కాదు ఒక బ్యాటింగ్‌ విభాగంగా మేం బౌలర్లు అందరినీ గౌరవించాలి. సొంతగడ్డపై ఆడుతుండటం వారికి ప్రయోజనకరం. అయితే మేం మా సహజమైన శైలిలో ఆడాల్సి ఉంటుంది".
-- రహానే, భారత జట్టు క్రికెటర్.​

వాళ్లే కీలకం...

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, ఎన్​సీఏ ఛైర్మన్​ రాహుల్‌ ద్రవిడ్​ కలిసి భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు రహానే.

BCCI president Sourav Ganguly and India A coach Rahul Dravid will take Indian cricket to unprecedented heights: Rahane
గంగూలీ, ద్రవిడ్​

" 2014లో మాకంత అనుభవం లేదు. ఇంగ్లాండ్‌తో ఘోర పరాజయం తర్వాత మేమంతా మాట్లాడుకున్నాం. అగ్రస్థానానికి చేరుకోవాలని పట్టుదలతో కృషి చేశాం. కోహ్లీ, రవి భాయ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో కలివిడితనం పెంచారు. ఆటగాళ్లందరం ప్రేమతో ముందుకు సాగుతాం. ప్రసుత్తం దాదా, ద్రవిడ్​ వల్లే భారత జట్టు స్థాయి అత్యున్నత దశకు చేరుతోంది".
-- రహానే, భారత జట్టు సారథి.

జనవరి 24 నుంచి మార్చి 4 మధ్యలో న్యూజిలాండ్​ గడ్డపై ఆ జట్టుతో... 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది టీమిండియా.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Baghdad - 1 January 2020
1. Various of protesters dismantling picketers' tents in front of the embassy
2. Various of protesters putting blankets in big sacks
3. Various of protesters loading trucks
4. SOUNDBITE (Arabic), Fadhil al Gezzi, Hashd al Shaabi supporter:
"After the achievement of the intended aim of this stance, we pulled out from this place triumphantly, and we soaked America's nose in dirt."
5. Various of loaded pickup trucks and Hashd trucks leaving the US embassy area and the Green Zone
STORYLINE:
Hashd al Shaabi and Kataeb Hezbollah supporters have pulled out from the American Embassy area in the heavily fortified Green Zone area of Baghdad.
Hashd supporters were dismantling picket tents in front of the embassy, and loading blankets and mattresses into trucks.
Hashd military trucks were seen also carrying supporters to outside the Green Zone area in Baghdad.
The Popular Mobilization Forces called Hashd and Kataeb Hezbollah members and supporters to pull out from the area where they had been gathering for two days.
The protest was sparked by deadly US airstrikes that targeted an Iran-backed militia on Sunday, killing 25 fighters.
Those strikes were in response to a rocket attack on an Iraqi army base that killed a US contractor last week.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.