ETV Bharat / sports

గబ్బా టెస్టుకు వరుణుడి ముప్పు.. ఐదోరోజు ఆట కష్టమే!

author img

By

Published : Jan 18, 2021, 9:53 PM IST

భారత్​, ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టు ఫలితం తేలేలా కనపడటం లేదు. చివరి టెస్టు ఆఖరిరోజైన మంగళవారం గబ్బాలో ఉరుములతో కూడిన భీకర వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Australia vs India, Brisbane Test: Rain, thunderstorm in weather forecast for Day 5 at Gabba
గబ్బాలో ఉరుములతో కూడిన వర్షం.. టెస్టు అనుమానమే

భారత్,​ ఆస్ట్రేలియా మధ్య రసవత్తరంగా జరుగుతున్న టెస్టు సిరీస్​ రేపటితో ముగియనుంది. చివరి టెస్టులో 328 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన టీమ్​ఇండియా బ్యాటింగ్​కు ఆదిలోనే వరుణుడు బ్రేకులు వేశాడు. అయితే మంగళవారం కూడా మ్యాచ్ జరగడం అనుమానంగానే కనిపిస్తోంది. గబ్బాలో రేపు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ప్రస్తుత బోర్డర్-గావస్కర్ ట్రోఫీని భారత్​ నిలబెట్టుకోవాలంటే.. ఆఖరి టెస్టులో గెలిచినా లేదా డ్రా చేసినా సరిపోతుంది. కానీ ఆసీస్​ దక్కించుకోవాలంటే మాత్రం కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. అయితే అందుకు చివరిరోజు పూర్తిగా ఆడాల్సింది ఉంటుంది.

నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటై భారత్​ ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్​ ఛేదన ప్రారంభించిన భారత్​.. 4/0తో నిలిచింది. తొలి రెండు టెస్టుల్లో చెరో విజయం సాధించిన ఇరు జట్లు మూడో మ్యాచ్​ను డ్రాగా ముగించాయి.

ఇదీ చూడండి: ఉత్కంఠగా గబ్బా టెస్టు.. గెలుపు ఎవరిదో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.