ETV Bharat / sports

తొలి టెస్టులో భారత్​పై ఆస్ట్రేలియా ఘనవిజయం

author img

By

Published : Dec 19, 2020, 1:27 PM IST

Updated : Dec 19, 2020, 1:46 PM IST

AUS vs IND Test: Australia beat India by 8 wickets
డే నైట్ టెస్టులో భారత్​పై ఆస్ట్రేలియా ఘనవిజయం

టీమ్ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. 8 వికెట్ల తేడాతో గెలిచి నాలుగు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

అడిలైడ్ వేదికగా టీమ్ఇండియాతో జరిగిన డే నైట్ టెస్టు మ్యాచ్​లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలిచి నాలుగు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్​లో 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు మూటగట్టుకున్న కోహ్లీసేన ఆసీస్​ ముందు 90 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆసీస్.

ఓపెనర్లు మాథ్యూ వేడ్‌(33), జో బర్న్స్‌(51*) నిలకడగా ఆడి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే వేడ్‌ రనౌటయ్యాక, మార్నస్‌ లబుషేన్‌(6) కూడా విఫలమయ్యాడు. చివరికి స్మిత్‌(1)తో కలిసి బర్న్స్‌ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రెండో టెస్టు డిసెంబర్‌ 26న మెల్‌బోర్న్‌లో ప్రారంభంకానుంది.

Last Updated :Dec 19, 2020, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.