ETV Bharat / sports

మ్యాచ్​ మధ్యలో భారత కీపర్​కు మ్యాక్స్​వెల్ క్షమాపణలు

author img

By

Published : Nov 28, 2020, 11:40 AM IST

Updated : Nov 28, 2020, 12:02 PM IST

Apologised to KL Rahul when batting in 1st ODI: Glenn Maxwell responds
మ్యాచ్​ మధ్యలో భారత కీపర్​కు మ్యాక్స్​వెల్ క్షమాపణలు

భారత్​తో తొలి వన్డేలో ఓ క్రేజీ సంఘటన జరిగింది. తాను బాగా బ్యాటింగ్​ చేసినందుకు ప్రత్యర్థి జట్టులోని కేఎల్​ రాహుల్​కు సారీ చెప్పాడు ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్​వెల్. ఎందుకు చెప్పాడు? అసలు ఏం జరిగింది?

ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్​.. భారత క్రికెటర్ కేఎల్​ రాహుల్​కు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని అతడే ట్విట్టర్​ వేదికగా పంచుకున్నాడు. టీమ్​ఇండియా-ఆసీస్ తొలి వన్డే సందర్భంగా ఈ ఆసక్తికర విషయం జరిగింది. ఇంతకీ ఏమైందంటే?

ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్​లో పంజాబ్​ తరఫున ఆడాడు మ్యాక్స్​వెల్. అయితే 13 మ్యాచ్​ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్​ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు.

అక్కడి నుంచి నేరుగా స్వదేశానికి చేరుకున్న మ్యాక్స్​వెల్.. భారత్​తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి.

ఐపీఎల్​లో కేఎల్​ రాహుల్​ నేతృత్వంలో ఆడిన మ్యాక్స్​వెల్.. అతడు కీపింగ్​ చేస్తుండగా, తొలి వన్డేలో ధనాధన్ ఇన్నింగ్స్​తో చెలరేగిపోయాడు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.

వీటిపై స్పందించిన కివీస్ క్రికెటర్ జిమ్మీ నీషన్.. మ్యాక్స్​వెల్​ను ట్యాగ్​ చేసి ఓ ప్రశ్న ఆడిగాడు. దీంతో "నేను బ్యాటింగ్​ చేస్తుండగా అతడికి సారీ చెప్పాను" అని మ్యాక్సీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది.

Last Updated :Nov 28, 2020, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.