ETV Bharat / sports

ఐపీఎల్​లో లెజండరీ క్రికెటర్ల వారసులు!

author img

By

Published : Feb 9, 2021, 12:59 PM IST

5 star Cricketers kids who have featured in IPL
ఐపీఎల్​లో లెజండరీ క్రికెటర్ల వారసులు!

మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్​ వారసుడు అర్జున్​.. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో అరంగేట్రం చేయనున్నాడు. గత కొన్నేళ్లుగా ముంబయి ఇండియన్స్​ జట్టు నెట్​ బౌలర్​గా పనిచేసిన అతడు.. ఈసారి ఐపీఎల్​ వేలంలో పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్​లో ఆడిన ఐదుగురు స్టార్​ క్రికెటర్ల వారసుల గురించి తెలుసుకుందాం.

ఐపీఎల్​లో అరంగేట్రం చేసేందుకు సచిన్​ వారసుడు అర్జున్​ సిద్ధమయ్యాడు. గత కొన్నేళ్లుగా ముంబయి ఇండియన్స్​ నెట్​ బౌలర్​గా పనిచేసిన అర్జున్​ తెందూల్కర్​.. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్​ వేలంలో చేరాడు. 2018లో అండర్​-19 టెస్టు మ్యాచ్​లకు ప్రాతినిధ్యం వహించిన అనుభవం అతడికి ఉంది.

అయితే ఈ ఐపీఎల్​లో సచిన్​ తనయుడి అరంగేట్రం ఉంటుందో? లేదో? తెలియాలంటే ఫిబ్రవరి 18 వరకు వేచి చూడాల్సిందే. ఈ సందర్భంగా ఐపీఎల్​లో రాణించిన 5 టాప్​ స్టార్​ క్రికెటర్ల వారసుల గురించి తెలుసుకుందాం.

స్టువర్ట్​ బిన్నీ

భారత లెజెండరీ క్రికెటర్​ రోజర్​ బిన్నీ తనయుడే స్టువర్ట్​ బిన్నీ. ఐపీఎల్​ కెరీర్​లో ఇప్పటివరకు ముంబయి ఇండియన్స్​, రాయల్ ఛాలెంజర్స్​ బెంగుళూరు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ ఆల్​రౌండర్​.. 2014లో రాజస్థాన్​ రాయల్స్​ జట్టులో చేరాడు.

5 star Cricketers kids who have featured in IPL
స్టువర్ట్​ బిన్నీ

స్టువర్ట్​ బిన్నీ.. తన ఐపీఎల్​ కెరీర్​లో 880 పరుగులు చేయగా.. 22 వికెట్లను పడగొట్టాడు. అయితే గతేడాది జరిగిన సీజన్​లో మాత్రం ఏ జట్టు అతడిని వేలంలో కొనుగోలు చేయలేదు. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్​ వేలంలో అమ్ముడుపోయే అవకాశాలూ తక్కువే.

రోహన్​ గావస్కర్​

5 star Cricketers kids who have featured in IPL
సునీల్​ గావస్కర్​తో రోహన్​ గావస్కర్​

లెజండరీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​ వారసుడిగా క్రికెట్​లో అరంగేట్రం చేసిన రోహన్​ గావస్కర్​.. ఐపీఎల్​-2009 సీజన్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు తరఫున కేవలం రెండు మ్యాచ్​ల్లో ఆడాడు. రోహన్​ ప్రస్తుతం తన తండ్రి బాటలోనే క్రికెట్​ కామెంటేటర్​గా వ్యవహరిస్తున్నాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్​లో అడుగుపెట్టిన రోహన్​.. 11 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు.

యువరాజ్​ సింగ్​

ఒకప్పుడు ఐపీఎల్​లో అత్యధిక పారితోషకం అందుకున్న క్రికెటర్​గా యువరాజ్​ సింగ్​ ఘనత వహించాడు. భారత మాజీ పేసర్​ యోగ్​రాజ్​ సింగ్​ కుమారుడే యువరాజ్​ సింగ్. ఐపీఎల్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్టు తరఫున కెరీర్​ ప్రారంభించి ఆ తర్వాత పుణె వారియర్స్​ టీమ్​లో చేరాడు. 2014 సీజన్​లో యువరాజ్​ను​​ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగుళూరు కొనుగోలు చేయగా.. 2016లో రూ.16 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్​ సొంతం చేసుకుంది.

5 star Cricketers kids who have featured in IPL
యువరాజ్​ సింగ్​

2016-17 సీజన్లలో సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టులో చేరగా.. 2018లో తిరిగి కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ టీమ్​తో కలిశాడు. చివరిగా రిటైర్మెంట్​కు ముందు 2019లో ముంబయి ఇండియన్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

షాన్​ మార్ష్​

5 star Cricketers kids who have featured in IPL
షాన్​ మార్ష్​

ఆస్ట్రేలియా లెజెండ్​ క్రికెటర్​ జియోఫ్ మార్ష్ వారసుడే ఈ షాన్​ మార్ష్​. ఐపీఎల్​ ఆరంభ సీజన్​లో అద్భుతమైన ప్రదర్శనతో 616 పరుగులు నమోదు చేసి 11 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్​లో సెంచరీతోనూ షాన్​ మార్ష్​ అలరించాడు. ఐపీఎల్​ కెరీర్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ ఫ్రాంచైజీ తరఫున ప్రాతినిధ్యం వహించి.. మొత్తంగా 2477 పరుగులను రాబట్టాడు. అయితే షాన్ ఇప్పుడు ఐపీఎల్​లో ఆడడం లేదు.

మిచెల్​ మార్ష్​

ఆస్ట్రేలియా క్రికెటర్​ షాన్ మార్ష్​ సోదరుడు, జియోఫ్​ మార్ష్​ చిన్న కుమారుడు మిచెల్​ మార్ష్​. ఐపీఎల్​ 2010 సీజన్​లోనే ఈ సోదరులిద్దరూ ఐపీఎల్​లో అరంగేట్రం చేసినా.. మిచెల్​ మార్ష్​కు ఎక్కువ అవకాశాలు దక్కలేదు. ఐపీఎల్​లో మిచెల్​ ఆడిన మ్యాచ్​లు కేవలం 21. కొన్ని కారణాల వల్ల 2017 నుంచి 2019 వరకు ఐపీఎల్​కు అందుబాటులో లేడు.

5 star Cricketers kids who have featured in IPL
మిచెల్​ మార్ష్​

గతేడాది జరిగిన ఐపీఎల్​ సీజన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించి.. 225 పరుగులు చేసి.. 20 వికెట్లను పడగొట్టాడు. దీంతో ఈ ఏడాది సీజన్​కు మిచెల్​ మార్ష్​ను ఆ జట్టు అట్టిపెట్టుకుంది. ​ఐపీఎల్​ కెరీర్​లో మిచెల్​.. రైజింగ్​ పుణె సూపర్​జైయింట్స్​, డెక్కన్​ ఛార్జర్స్​, పుణె వారియర్స్​ జట్లలో ఆడాడు.

ఇదీ చూడండి: చెపాక్​లో భారత్​దే​ హవా.. మరి ఇప్పుడు ఏం చేస్తుందో?

కుల్దీప్​కు మరోసారి అన్యాయం.. అభిమానుల ఆగ్రహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.