ETV Bharat / sports

క్వారంటైన్​లో పుజారా ఏం చేస్తున్నాడో తెలుసా?

author img

By

Published : May 25, 2021, 6:58 PM IST

భారత టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా.. ముంబయిలో క్వారంటైన్​లో కాలక్షేపం కోసం ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నాడు. తన కూతురు అదితితో కలిసి వీడియో గేమ్ ఆడుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

Cheteshwar Pujara, test specialist
ఛెతేశ్వర్ పుజారా, టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు

ఇంగ్లాండ్​ పర్యటనకు ముందు భారత ఆటగాళ్లందరూ ముంబయిలో తప్పనిసరి క్వారంటైన్​లోకి వెళ్లారు. మే 19 నుంచి 14 రోజుల పాటు నిర్బంధంలోకి వెళ్లింది ఇండియా జట్టు. అయితే వారికి కేటాయించిన గదుల్లోనే రెండు వారాల పాటు ఉండాలంటే ఎవరికైనా ఇబ్బందే. ఈ క్వారంటైన్ సమయాన్ని గడపడానికి కొందరు ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల్లో సరదాగా గడుపుతున్నారు. మరికొందరు పుస్తకాలు చదువుతూ.. సినిమాలు చూస్తూ.. ఎక్సర్​సైజ్​లు​ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్​ పుజారా మాత్రం ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నాడు. తన కూతురు అదితితో కలిసి వీడియో గేమ్​ ఆడుతున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. 'ఈమె నా క్వారంటైన్​ గేమ్​ భాగస్వామి' అంటూ పరిచయం చేశాడు.

Cheteshwar Pujara introduces his 'Quarantine Gaming Partner' ahead of England Tour
పుజారా గేమింగ్​ పార్ట్​నర్​

ఇదిలా వుండగా, ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు పుజారా కీలకం కానున్నాడు. గత ఆసీస్ సిరీస్​లో నిలకడగా రాణించాడు ఈ వన్​డౌన్​ బ్యాట్స్​మన్​. కివీస్​తో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​లోనూ పుజారా రాణిస్తే భారత్​కు ఎదురే ఉండదు. ఈ సిరీస్​ కోసం జూన్ 2న ఇంగ్లాండ్ బయలుదేరనుంది టీమ్ఇండియా. అక్కడికి చేరుకున్నాక మరో 10 రోజులు సౌథాంప్టన్​లో క్వారంటైన్​కు వెళ్లనున్నారు. జూన్​ 18-22వరకు ఛాంపియన్​షిప్​ ఫైనల్, ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14వరకు ఇంగ్లాండ్​తో టెస్ట్​ సిరీస్​ జరగనుంది.

ఇదీ చదవండి: క్వారంటైన్​లో టీమ్ఇండియా.. బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.