ETV Bharat / sports

ఐపీఎల్​లో జాక్​పాట్​.. ఇప్పుడేమో టీమ్​ఇండియాకు.. ఘనంగా సెలబ్రేషన్స్​

author img

By

Published : Jan 27, 2022, 1:49 PM IST

Updated : Jan 27, 2022, 2:17 PM IST

RaviBishnoi Westindies series: మణికట్టు మాయజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ఎదుర్కొనే యువ స్పిన్నర్​ రవి బిష్లోయ్​.. వెస్టిండీస్​ టీ20, వన్డే సిరీస్​కు ఎంపికయ్యాడు. ఈ సిరీస్​తోనే జాతీయ జట్టుకు తొలిసారి సెలెక్ట్​ అయ్యాడు. దీంతో అతడి కుటుంబంలో ఘనంగా వేడుక చేసుకున్నారు. కేక్​ కట్​ చేసి డ్యాన్స్​లు వేస్తూ అందరూ సరదాగా గడిపారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి.. టీమ్​ఇండియాకు సెలెక్ట్​ అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు.

ravi bishnoi celebrations
ravi bishnoi celebrations

స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఇంట్లో సంబరాలు

RaviBishnoi Westindies series: క్రికెట్ కెరీర్​గా మైదానంలో అడుగుపెట్టిన ప్రతిఒక్క క్రికెటర్​కు టీమ్ఇండియాలో చోటు ద్కకించుకుని సత్తా చాటాలనేదే కోరిక. కానీ ఆ అవకాశం అందరికీ రాదు. అయితే ఆ ఛాన్స్​ తనకు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు యువ స్పిన్నర్​ రవిబిష్ణోయ్​. వెస్టిండీస్​తో వన్డే, టీ20 సిరీస్​ కోసం తాజాగా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ బోర్డు. అందులో రవికి చోటు దక్కింది. మూడేళ్లలోనే అండర్​-19 నుంచి జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు.​ దీంతో అతడి కుటుంబంలో సంబరాలు చేసుకున్నారు. తోటి ప్లేయర్లు, రవి కోచ్​, కుటంబం కలిసి కేక్​ కట్​ చేసి సెలబ్రేషన్స్​ చేసుకున్నారు. ఇంటి ముందు డ్యాన్స్​లు వేస్తూ సరదాగా గడిపారు. రాజస్థాన్​ సీఎం అశోక్​ గ్లెహోత్​ కూడా అతడికి శుభాకాంక్షలు చెప్పారు.

బిష్ణోయ్​ను అంతకుముందే ఈ ఐపీఎల్​లో కొత్తగా బరిలో దిగనున్న అహ్మదాబాద్​ జట్టుకు కూడా అతడిని రూ.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ మెగాటోర్నీలో 2018 మార్చిలోరాజస్థాన్​ రాయల్స్​ నెట్​ బౌలర్​గా తీసుకుంది. అ తర్వాత అతడు పంజాబ్​ కింగ్స్​కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు ఆడిన 23 మ్యాచుల్లో 6.96 ఎకానమీ రేటుతో 24 వికెట్లు తీశాడు. ఐపీఎల్​లో కనీస ధర రూ.20 లక్షలకు వేలంలో నిలిచిన ఇతడిని పంబాజ్​ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.

.
రవిబిష్ణోయ్​ ఫ్యామిలీ
.
రవిబిష్ణోయ్​ ఇంట్లో సంబరాలు

అంతా ఆయన వల్లే..

ఐపీఎల్​ నుంచి టీమ్​ఇండియా వరకు తన ప్రయాణంలో భారత దిగ్గజం అనిల్​ కుంబ్లే పాత్ర మరువలేనిదని అన్నాడు రవి బిష్ణోయ్​. " భారత జట్టుకు ఎంపికవ్వడం గర్వంగా ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. అనిల్ కుంబ్లే​ సార్​ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒత్తిడిలోనూ ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన నన్ను ప్రోత్సాహించారు. మనలోని బలాలను గుర్తించి వాటిని సరైన సమయంలో ఉపయోగించుకోవాలని సూచించేవారు. మైరుగైన క్రికెటర్​గా ఎదగడంలో ఈ సలహాలు, సూచనలు నాకెంతగానో తోడ్పడ్డాయి" అని రవి పేర్కొన్నాడు.

కెరీర్​ ప్రారంభమిలా..

రాష్ట్రస్థాయి అండర్​-16లో ఓ సారి, అండర్​-19 విభాగంలో రెండు సార్లు ప్రయత్నించినప్పటికీ అతడికి మొదట అవకాశం రాలేదు. అనంతరం అండర్​-19కు ఆడే అవకాశం వచ్చింది.

అండర్​-16లో రెండు మ్యాచుల కోసం ఎంపికైనప్పటికీ అతడికి ఆడే అవకాశం రాలేదు. 2018లో రాష్ట్ర అసోసియేషన్ తరఫున బరిలో దిగిన అతడు ఐదు మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు. ఆ తర్వాత నేషనల్​ బోర్డు తరఫున ఆడిన ఓ టెస్టులో ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. అయినప్పటికీ అతడు అండర్​-19కి ఎంపికవ్వలేదు. కానీ అతడి నిలకడ ప్రదర్శన వల్ల 2018-19 సీజన్​లో ముస్తాక్​ అలీ ట్రోఫీకి అతడు ఎంపికయ్యాడు. తన తొలి టీ20 మ్యాచ్​ను తమిళనాడుపై ఆడాడు. తన తొలి యూత్​ వన్డేను ఇంగ్లాండ్​పై ఆడాడు. ఈ మ్యాచ్​లో మూడు వికెట్లు తీశాడు.

2019 సెప్టెంబరులో విజయ్​ హజారే ట్రోఫీలో భాగంగా జమ్ము కశ్మీర్​తో జరిగిన మ్యాచ్​తో లిస్ట్​-ఏ అరంగేట్రం చేశాడు. అక్టోబర్​లో దేవ్​దర్​, రంజీ ట్రోపీ కోసం ఇండియా-ఏ జట్టులో ఎంపికయ్యాడు. డిసెంబరులో అండర్​-19 వరల్డ్​ కప్(2020లో జరిగిన) కోసం​ భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు.

.
రవిబిష్ణోయ్​ ఇంట్లో సంబరాలు

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

IPL Auction 2022: ఈ ప్లేయర్లే చెన్నై జట్టు టార్గెట్​!

Last Updated : Jan 27, 2022, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.