ETV Bharat / sports

WWE రెజ్లర్​గా మారిన హార్దిక్‌ పాండ్య..!

author img

By

Published : Feb 25, 2022, 7:35 PM IST

Carmelo Hayes Hardik Pandya
హార్దిక్​ పాండ్య

టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్​ హార్జిక్​ పాండ్యను పోలిన ఓ రెజ్లర్​ ఫొటోలు సోషల్​ మీడియాలో వైరలయ్యాయి. దీనిపై స్పందించిన అభిమానులు.. పాండ్య క్రికెట్​ వదిలేసి రెజ్లింగ్​లోకి అడుగుపెట్టాడంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Carmelo Hayes Hardik Pandya: టీమ్‌ఇండియా స్టార్‌ హిట్టర్‌ హార్దిక్‌ పాండ్య ఇప్పుడు వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (WWE)లోకి ప్రవేశించాడని అభిమానులు ఛలోక్తులు విసురుతున్నారు. తాజాగా పాండ్యను పోలిన ఓ రెజ్లర్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడమే అందుకు కారణం. WWE NXT స్టార్‌ రెజ్లర్‌ కార్మెలో హేస్‌.. చూడటానికి అచ్చం పాండ్యలాగే ఉండటంతో అతడి ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ విషయాన్ని గుర్తించిన భారత్‌లోని పలువురు నెటిజన్లు ఆ ఫొటోలకు తమ క్రియేటివిటీ జోడించారు. దీంతో హార్దిక్‌ పాండ్య క్రికెట్‌ వదిలేసి రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టాడని, ఇటీవల వెంకటేశ్‌ అయ్యర్‌ ఆట చూశాక అతడు క్రికెట్‌ వీడాడని, ఇప్పుడు టీమ్‌ఇండియాలోకి వచ్చేందుకు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని ఇలా రకరకాలుగా సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇక ఈ విషయం చివరికి కార్మెలో హేస్‌కు చేరడంతో ఇటీవల అతడు స్పందించాడు. 'భారత్‌లో నా లాంటి పోలికలున్న హార్దిక్‌ పాండ్య ట్రెండ్‌ అవుతున్నాడు' అంటూ ట్వీట్‌ చేశాడు. ఇదిలా ఉండగా.. హార్దిక్‌ గతేడాది టీ20 ప్రపంచకప్‌లో విఫలమయ్యాక టీమ్‌ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు అతడు రాబోయే ఐపీఎల్‌ మెగా ఈవెంట్‌పైనా దృష్టిసారించాడు. గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో మెగా ఈవెంట్‌లో ఆ జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తిగా మారింది. అయితే, ఇటీవల వెస్టిండీస్‌ సిరీస్‌లో కొత్తగా జట్టులోకి వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌ ఆటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. దీంతో చాలా మంది టీమ్‌ఇండియా అభిమానులు పాండ్యకు దీటుగా సరైన ఆల్‌రౌండర్‌ దొరికాడని భావిస్తున్నారు.

ఇదీ చూడండి : Mirabai Chanu: మీరాబాయ్​ చానుకు గోల్డ్​ మెడల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.