ETV Bharat / sports

పంత్​పై రోహిత్​ ఫైర్​.. ఎందుకంటే?

author img

By

Published : Aug 7, 2022, 12:47 PM IST

captain Rohithsharma fire on pant: వెస్టిండీస్​తో జరిగిన నాలుగో టీ20 విజయంలో పంత్​ కీలక పాత్ర పోషించిన వికెట్​కీపర్​ పంత్​పై కెప్టెన్​ రోహిత్​ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Rohithsharma fire on Rishabpant
పంత్​పై రోహిత్​ ఫైర్​.. ఎందుకంటే?పంత్​పై రోహిత్​ ఫైర్​.. ఎందుకంటే?

captain Rohithsharma on pant: పూరన్​ రనౌట్​ విషయంలో పంత్​ ప్రవర్తన టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మకు కోపం తెప్పించింది. కానీ వెంటనే ఓ నవ్వుతో ఆ కోపాన్ని కవర్​ చేశాడు.

అసలేం జరిగిందంటే... విండీస్‌ ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌లో నికోలస్‌ పూరన్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ రనౌట్‌ చేసింది పంత్‌. అయితే రనౌట్‌కు ముందు ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో కవర్‌ పాయింట్‌ దిశగా ఆడిన పూరన్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న కైల్‌ మేయర్స్ వద్దని వారించిన వినకుండా ముందుకు పరిగెత్తాడు. అప్పటికే మిడ్‌ఫీల్డ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ వేగంగా పరిగెత్తుకొచ్చి పంత్‌కు క్విక్‌ త్రో వేశాడు. బంతిని అందుకున్న పంత్‌.. వికెట్లను గిరాటేయకుండా సమయాన్ని వృథా చేశాడు. అయితే పూరన్‌ అప్పటికే సగం క్రీజు దాటి మళ్లీ వెనక్కి వచ్చినా తాను క్లియర్‌ రనౌట్‌ అవుతానని తెలిసి ఆగిపోయాడు. ఆ తర్వాత పంత్‌ బెయిల్స్‌ ఎగురగొట్టాడు. అయితే ఇదంతా గమనించిన రోహిత్‌.. పంత్‌​ దగ్గరకు వచ్చి..''సమయం ఎందుకు వృథా చేస్తున్నావ్‌.. బంతి దొరికిన వెంటనే బెయిల్స్‌ పడగొట్టొచ్చుగా'' అంటూ కోపాన్ని ప్రదర్శించాడు. అయితే తర్వాత కూల్‌ అయిన రోహిత్‌.. నవ్వుతూ పంత్‌ను హగ్‌ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టీమ్​ఇండియా 55 పరుగుల తేడాతో విజయం అందుకుంది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగులుండగానే భారత్‌ సొంతం చేసుకుంది. మొదట టాస్‌ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రిషభ్‌పంత్‌ 44 (31 బంతుల్లో 6×4), రోహిత్‌ శర్మ 33 (16 బంతుల్లో 2×4,3×6), సంజూ శాంసన్‌ 30 నాటౌట్‌ (23 బంతుల్లో 2×4,1×6), సూర్య కుమార్‌ 24 (14 బంతుల్లో 1×4,2×6) దీపక్‌ హుడా 21 (19 బంతుల్లో 2×4), అక్షర్ 20నాటౌట్‌ (8 బంతుల్లో 1×4,2×6) సమష్టిగా రాణించడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్‌ను భారత్‌ బౌలర్లు కట్టడి చేశారు. కట్టుదిట్టమైన బంతులు వేస్తూ స్కోరుబోర్డును ముందుకు కదలనివ్వలేదు. వెస్టిండీస్‌ బ్యాటర్లలో రోవ్‌మన్‌ పావెల్‌ (24), నికోలస్‌ పూరన్( 24) మినహా మిగతా వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 3 వికెట్లు పడగొట్టగా..అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌ తలో రెండు వికెట్లు తీశారు.

ఇదీ చూడండి: నాలుగో టీ20లో టీమ్​ఇండియా ఆల్​రౌండ్ షో.. సిరీస్​ మనదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.