ETV Bharat / sports

Tweet controversy: వివాదంలో మరో ఇద్దరు క్రికెటర్లు

author img

By

Published : Jun 9, 2021, 1:07 PM IST

ట్వీట్ల వివాదంలో మరో ఇద్దరు ఇంగ్లాండ్​ క్రికెటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కెప్టెన్ మోర్గాన్​, జాస్ బట్లర్.. గతంలో వివాదస్పద ట్వీట్లు చేసినట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్​గా మారింది. దీంతో విచారణ ప్రారంభించింది ఇంగ్లాండ్ బోర్డు.

Buttler, Morgan
బట్లర్​, మోర్గాన్

ఇంగ్లాండ్​ క్రికెట్​లో వివాదాస్పద ట్వీట్ల దుమారం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ ట్వీట్లపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద చేపట్టిన విచారణను వేగవంతం చేసింది ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు. వరుసగా ఆటగాళ్లను విచారించడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత కెప్టెన్ ఇయాన్​ మోర్గాన్(Eoin Morgan)​​, వికెట్​కీపర్​-బ్యాట్స్​మన్​ జాస్​బట్లర్​ను(Jos Buttler) కూడా విచారిస్తోంది.

ఎనిమిదేళ్ల క్రితం స్త్రీ వివక్ష, జాత్యంహకార సందేశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​లు చేశాడని యువ బౌలర్​ ఒల్లీ రాబిన్​సన్ (Ollie Robinson)​ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇటీవల సస్పెండ్ చేసింది ఈసీబీ. ఈ సంఘటన జరిగిన వెంటనే బట్లర్​, మోర్గాన్​ గతంలో భారతీయులను అపహాస్యం చేస్తూ చేసిన ట్వీట్ల స్క్రీన్​షాట్లు సోషల్​మీడియాలో వైరల్​ అయ్యాయి. అందులో వారు 'సర్'(సెటైరికల్​గా)​ అని సంబోధించారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'రాబిన్​సన్​ను సస్పెండ్​ చేసినట్లుగానే వీరిద్దరిపై కూడా నిషేధం విధించగలిగే దమ్ము ఉందా?' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ట్వీట్లను పరిగణలోకి తీసుకుని ఈసీబీ ఈ క్రికెటర్లను విచారించడం ప్రారంభించింది. ఐపీఎల్​లో బట్లర్(రాజస్థాన్​ రాయల్స్​)​, మోర్గాన్​(కోల్​కతా నైటర్​ రైడర్స్​)కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

ఈ వివాదస్పదనమైన ట్వీట్లను చేసిన వారిపై నిష్పాక్షికంగా విచారణ చేపట్టి నిజనిజాలను నిర్ధరణ చేసుకుని తగిన చర్యలు కచ్చితంగా తీసకుంటామని ఈసీబీ(ECB) మరోసారి వెల్లడించింది. ఆటలో వివక్షకు చోటు లేదని చెప్పింది.

డిలీట్​ చేసే పనిలో ప్లేయర్స్​

జాత్యాహంకార వ్యాఖ్యల్ని ఏమాత్రం సహించబోమని ఈసీబీ హెచ్చరించిన నేపథ్యంలో ఇంగ్లాండ్​ క్రికెటర్లు తమ పాత వివాదస్పద ట్వీట్లను తొలిగించే పనిలో బిజీ అయ్యారు. సీనియర్​ ఫాస్ట్​ బౌలర్​ జేమ్స్​ అండర్సన్​ 11ఏళ్ల క్రితం తన సహచర ఆటగాడు స్టువర్ట్​ బ్రాడ్​ను లెస్బియన్​గా అభివర్ణించిన ట్వీట్​ను డిలీట్​ చేశాడు. బట్లర్​, మోర్గాన్​ కూడా తమ ట్వీట్లను తొలగించారు. కానీ అవి అప్పటికే వైరల్​ అయిపోయాయి.

ఇదీ చూడండి: జాతి వివక్ష: మరో క్రికెటర్​ సస్పెండ్​ కానున్నాడా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.