ETV Bharat / sports

రోహిత్, బుమ్రాలకు అరుదైన గౌరవం.. ఆ జాబితాలో చోటు

author img

By

Published : Apr 21, 2022, 12:35 PM IST

Wisden's five Cricketers of the Year: టీమ్​ఇండియా సారథి రోహిత్ శర్మ, స్టార్ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రాలకు అరుదైన గౌరవం దక్కింది. 2022 ఏడాదికి గానూ 'విజ్డెన్ ఫైవ్ క్రికెటర్స్​ ఆఫ్​ ఇయర్'​ జాబితాలో వారికి స్థానం లభించింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్.. 'లీడింగ్​ క్రికెటర్ ఇన్​ ది వరల్డ్​'గా నిలిచాడు.

jasprit bumrah news
rohit sharma

Wisden's five Cricketers of the Year: టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రాలకు అరుదైన గౌరవం లభించింది. 2022 విజ్డెన్ ఫైవ్ 'క్రికెటర్స్​ ఆఫ్​ ది ఇయర్'​ జాబితాలో వారికి చోటుదక్కింది. వారితో పాటు న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే, ఇంగ్లాండ్ పేసర్ ఓలీ రాబిన్​సన్, దక్షిణాఫ్రికా మహిళా స్టార్​ క్రికెటర్ డేన్ వాన్​ నీకెర్క్​ ఈ జాబితాలో ఉన్నారు.

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్.. 'లీడింగ్​ క్రికెటర్ ఇన్​ ది వరల్డ్'​గా నిలిచాడు. సఫారీ జట్టు బ్యాటర్ లీజెల్​ లీ.. 'లీడింగ్ ఉమెన్ క్రికెటర్​'గా ఘనత దక్కించుకుంది. ఇక పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 'లీడింగ్ టీ20 క్రికెటర్​ ఇన్​ ది వరల్డ్​ అవార్డు'ను పొందాడు.

గతేడాది వేసవిలో ఇంగ్లాండ్​ పర్యటన సందర్భంగా బుమ్రా అదిరిపోయే ప్రదర్శన చేశాడు. లార్డ్స్​, ఓవల్​ మైదానాల్లో మ్యాచ్​ విన్నర్​గా నిలిచాడు. దీంతో భారత్​కు 2-1 ఆధిక్యం లభించగా, కరోనా కారణంగా వాయిదా పడిన ఒక టెస్టు మ్యాచ్​ను ఈ ఏడాది జులైలో నిర్వహించనున్నారు.

ఇంగ్లాండ్ పర్యటనలో నాలుగు టెస్టుల్లో 52.57 సగటుతో 368 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఓవల్ మైదానంలో కీలకమైన 127 పరుగులు చేశాడు. అదే విదేశీ గడ్డపై రోహిత్​ తొలి టెస్టు సెంచరీ. ఇక గతేడాది టెస్టుల్లో 1708 పరుగులతో (చరిత్రలో మూడో అత్యధికం) 'లీడింగ్ క్రికెటర్​ ఆఫ్ ది ఇయర్'​గా నిలిచాడు రూట్.

ఇదీ చూడండి: David Warner: వార్నర్ అరుదైన రికార్డు.. రోహిత్​ తర్వాత అతడే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.