ETV Bharat / sports

Bumrah injury update : బుమ్రా రీఎంట్రీపై రోహిత్ క్లారిటీ.. వరల్డ్ కప్​కు ముందే జట్టులోకి!

author img

By

Published : Jul 27, 2023, 6:04 PM IST

Bumrah injury update : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. పేస్ బౌలర్ బుమ్రా పునరాగమనంపై స్పందించాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..

Bumrah Comeback
బుమ్రా రీ ఎంట్రీపై రోహిత్ క్లారిటీ

Bumrah Comeback : భారత స్టార్ బౌలర్ జస్​ప్రీత్ బుమ్రా త్వరలోనే జట్టులోకి రానున్నాడా? టీమ్ఇండియా జట్టుతో కలిసి ఐర్లాండ్ వెళ్లనున్నాడా? బెంగళూరులోని ఎన్​సీఏలో ఉన్న అతడు పూర్తిగా కోలుకున్నాడా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల్లో తలెత్తుతున్నాయి. అయితే బుమ్రా ఐర్లాండ్ సిరీస్​లో అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఇటీవల సంకేతాలు ఇచ్చింది. కానీ ఇప్పటికీ బుమ్రా విషయంలో స్పష్టమైన క్లారిటీ రాకపోవడం వల్ల భారత క్రికెట్ అభిమానులు సందిగ్ధంలో ఉన్నారు. అయితే టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ఈ విషయంపై తాజాగా స్పందించాడు.

ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న భారత్ .. గురువారం నుంచి వన్డే మ్యాచ్​లు ఆడనుంది. ఈ సందర్భంగా మొదటి మ్యాచ్​కు ముందు ప్రెస్​మీట్​లో పాల్గొన్న రోహిత్​ను బుమ్రా పునరాగమనం గురించి ఓ విలేకరి అడగ్గా.. అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. "టీమ్ఇండియాలో బుమ్రా అనుభవజ్ఞుడైన బౌలర్. అతడు జట్టుకు చాలా కీలకం. ప్రస్తుతం అతడు తీవ్ర గాయం నుంచి కోలుకుంటున్నాడు. కానీ ఐర్లాండ్ పర్యటనకు ఇంకా జట్టును ప్రకటించలేదు. అతడు ఆ సిరీస్​లో అడతాడో లేదో నాకు తెలియదు. కానీ అతడు ఆడితే మంచిదే. ఎందుకంటే చాలా కాలం విశ్రాంతి తర్వాత ఏ ఆటగాడైనా.. తొందరగా పాత ఫామ్​ను అందుకోలేడు. అందుకే బుమ్రా వరల్డ్ కప్​ కంటే ముందే జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని అనుకుంటున్నా. కానీ అదంతా అతడు కోలుకునే స్పీడ్​పైనే ఉంటుంది. మేము ఎప్పటికప్పుడు ఎన్​సీఏతో మాట్లాడుతున్నాం. ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి" అని రోహిత్ శర్మ అన్నాడు.

అయితే ప్రస్తుతం బెంగళూరులోని ఎన్​సీఏలో ఉన్న బుమ్రా.. త్వరగా కోలుకుంటున్నాడని, నెట్​ సెషన్​లో బౌలింగ్​ను మెరుగుపర్చుకుంటున్నాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే ఎన్​సీఏ అతడికి ప్రాక్టీస్ గేమ్స్ నిర్వహిస్తోంది. ​కానీ అతడి ఫిట్​నెస్​పై బీసీసీఐ పూర్తి క్లియరెన్స్ ఇస్తేనే బుమ్రా తిరిగి అంతర్జాతీయ పునరాగమనం చేస్తాడు.

కాగా బుమ్రా గతేడాది సెప్టెంబరు నుంచి గాయం కారణంగా క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది వెన్నుముక చికిత్స పూర్తి చేసుకున్న అతడు.. ప్రస్తుతం ఎన్​సీఏలో ఉంటున్నాడు. ఇక బుమ్రా వీలైనంత తొందరగా పూర్తి ఫిట్​నెస్ సాధించి మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తే.. టీమ్ఇండియాకు బౌలింగ్ కష్టాలు తప్పినట్టే అని క్రికెట్ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.