ETV Bharat / sports

'కంగారూలు​ తప్పు చేసేదాకా వేచి చూసి.. జడేజా, అశ్విన్​తో మాట్లాడి ప్లాన్​ వేశాం'

author img

By

Published : Feb 19, 2023, 10:59 PM IST

Updated : Feb 20, 2023, 7:16 AM IST

దిల్లీ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్​లో భారత్​ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్​ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్​లో మాట్లాడాడు. మ్యాచ్​ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆసీస్​ ప్లేయర్లు తప్పు చేసే దాకా వెయిట్​ చేశామని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే..

bordergavaskar trophy rohit sharma
bordergavaskar trophy rohit sharma

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య దిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్​లో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో 4 టెస్టుల సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఆధిక్యం సాధించింది. కాగా, మ్యాచ్‌ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రెస్​ కాన్ఫరెన్స్​లో రోహిత్‌ శర్మ మట్లాడుతూ.. 'మాకు అద్భుతమైన విజయం వచ్చింది. నిన్న మేము కొంచెం వెనకబడ్డాము. కానీ, ఈ రోజు తిరిగి పుంజుకుని మ్యాచ్‌ గెలిచాం. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కన్నా ఒక పరుగు వెనుకంజలో ఉన్నప్పుడు మేము వెనుకబడ్డామని భావించా. కానీ మా బౌలర్లు అద్భుతంగా ఆడారు" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

తప్పు చేయాలనే వెయిట్​ చేశాం..
కంగారూలు తప్పు చేసేదాగా వేచి చూడలనుకున్నామని రోహిత్​ తెలిపాడు. ఆ తర్వాత అంతా తాము అనుకున్నట్టే జరగిందని వెల్లడించాడు. ' రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌తో చర్చించి ప్లాన్స్​ వేశాం. ఇంలాంటి పరిస్థితుల్లో జడేజా, అశ్విన్ ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. దీంతో వారికి బౌలింగ్‌ విషయంలో స్వేచ్ఛనిచ్చా. జడేజా, విరాట్ కోహ్లీ.. అక్షర్‌ పటేల్, అశ్విన్‌ నెలకొల్పిన పార్టనర్​షిప్​లు మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఈ స్లో పిచ్‌పై 100 పరుగుల పార్టనర్​షిప్​ నెలకొల్పడం అంత సులభం కాదు' అని రోహిత్‌ శర్మ వెల్లడించాడు.

Last Updated :Feb 20, 2023, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.